హాలీవుడ్

ప్చ్..అక్కడ ‘బాహుబలి’ దారుణంగా

after-breaking-several-records-in-india-baahubali-set-for-a-grand-release-in-china-1bahubali-mahishmati-theme-song-downloadది ప్రైడ్ ఆఫ్ ది నేషన్, బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయిర్ అంటూ చెప్పుంకుంటూ వస్తున్న బాహుబలికు తొలిసారి దెబ్బ తగిలింది. ఈ చిత్రం చైనాలో ఫ్లాపైంది. అక్కడ జనాలకు ఈ సినిమా ఎక్కలేదు. అక్కడా మార్కెటింగ్ ప్రమోషన్స్ తో ఓ రేంజిలో క్రేజ్ తెచ్చారు. అయితే హైప్ కు తగ్గట్లు సినిమా లేదని అక్కడ జనాలు తేల్చేసారని అక్కడ వస్తున్న కలెక్షన్స్ ని బట్టి అర్దమవౌతోంది.

బాహుబలి అక్కడ మార్కెట్లో టాప్ టెన్ లో ఉందని, జాకీ ఛాన్ లేటెస్ట్ చిత్రాన్ని సైతం పోటీ ఇచ్చి ప్రక్కకు నెట్టేసిందని మన మీడియాలో వస్తున్న వార్తలన్ని అబద్దమే అని తేలిపోయింది. ఈ విషయమై హాలీవుడ్ రిపోర్టర్ వారు ఓ ప్రత్యేకమైన ఆర్టికల్ సైతం రాసి, బాహుబలి అక్కడ వర్కవుట్ కాలేదని తేల్చారు. 

అక్కడ చాలా దారణంగా ఆక్యుపెన్సీ రేటు ధియోటర్స్ లో ఉండటంతో చిత్ర నిర్మాతలు సైతం సోషల్ మీడియాలో ఈ విషయమై కిక్కురు మనటం లేదు. లేకపోతే నిర్మాతలు, దగ్గుపాటి రానా ఈ విషయమై ట్విట్టర్ లో కంటిన్యూగా పోస్ట్ లు పెడుతూనే ఉండేవారనటంలో సందేహం లేదు.

చైనా నేటివిటీకి తగ్గట్లు బ్యాక్‌గ్రౌండ్ స్కోరు, ఎడిటింగ్ తదితర విభాగాల్లో మార్పులు చేసి చైనా వెర్షన్‌ను రూపొందించినా ఫలితం లేకపోవటం యూనిట్ ని విచారంలో ముంచెత్తిందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని హాలీవుడ్ ఎడిటర్ విన్సెంట్ టబిల్లాన్‌తో ఎడిట్ చేయించారంటే దర్శక, నిర్మాతలు ఎంత పట్టుదలతో ఉన్నారో అర్థం అవుతోంది. ఈ కష్టానికి తగ్గట్లుగానే బాహుబలికి అక్కడ దాదాపు 7.1రేటింగ్ ఇచ్చిన అక్కడి సినీ సంస్థలు ప్రస్తుతం 7.7కు ఈ రేటింగ్‌ను పెంచి సహకరించాయి.  అయితే ప్రేక్షకుల ఆదరణ లేనప్పుడు ఎంత డబ్బా వాయించుకుంటే లాభం ఏముంటుంది..చెప్పండి.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

లండన్ బాబులు

Now Showing

మహానుభావుడు SEP 29
స్పైడర్ SEP 27
జై లవ కుశ SEP 21
ARJUN REDDY AUG 25

Poll