టాలీవుడ్

విశాల్‌.. కు గేమ్ స్టార్టైంది, డైరక్టర్ రంగంలోకి దిగి ఆరోపణలు

vishal-RK-Nagarతమిళ సినీ హీరో విశాల్‌ చెన్నైలోని ఆర్కే నగర్‌ ఉప ఎన్నికకు నామినేషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన విశాల్‌… దివంగత జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్‌ నుంచే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నామినేషన్‌ కు ముందు విశాల్‌ స్థానిక గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎం.జి.ఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఆ తర్వాత జయలలిత సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం నామినేషన్‌ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా విశాల్ పోటీ చేస్తున్నప్పటికీ అన్నాడీఎంకే దివంగత నేతల ఆశీస్సులు తీసుకోవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరో ప్రక్క తమిళ నిర్మాతల మండలి అధ్యక్ష బాధ్యతలను నిర్వహిస్తున్న విశాల్‌పై దండెత్తడానికి ఆయన వ్యతిరేక వర్గం సిద్ధమైంది.

విశాల్….నిర్మాతల మండలి అధ్యక్ష పదవికి విశాల్‌ రాజీనామా చేయాలని డిమండ్‌ చేస్తూ నటుడు, దర్శకుడు చేరన్‌ తమిళ నిర్మాతల మండలికి లేఖ రాశారు. విశాల్‌ తమిళ నిర్మాతల మండలి అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలంటూ చేరన్ ట్విట్టర్‌లో గొంతు విప్పారు. విశాల్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తామంటూ హెచ్చరించారు. దీనిపై ఆయన సోమవారం నిర్మాతల మండలికి లేఖను రాశారు. అందులో మొట్టమొదటి సారి పోటీలోనే నకిలీ ముఖంతో ఎవరి ప్రేరేపణతోనో విశాల్‌ వ్యాపార గుర్రంగా మారారని ఆరోపించారు.

దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికల్లో గెలవగానే డీఎంకే నేత కరుణానిధిని కలిసి ఆశీస్సులు అందుకున్న విశాల్‌ ఇప్పుడు ఎంజీఆర్, జయలలిత సమాధులకు నివాళులర్పించి స్వతంత్య్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీకి సోమవారం నామినేషన్‌ దాఖలు చేయడంలో అర్ధం ఏమిటని ప్రశ్నించారు. విశాల్‌ చర్యలకు నడిరోడ్డున పడేది నిర్మాతలేనని పేర్కొన్నారు. ఇకపై నిర్మాతలకు పార్టీ, ప్రభుత్వాల నుంచి సహాయం అందదని పేర్కొన్నారు. తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా విశాల్‌ నిర్మాతలకు మేలు చేసిందేమీ లేదని అరోపించారు.

అయితే తాను ప్రజా ప్రతినిధి కావాలనుకుంటున్నానని, వారికి మంచి చేయాలనుకుంటున్నానని విశాల్ చెప్పారు. ప్రజల కోరికలు, ఆకాంక్షలు నెరవేర్చాలనుకుంటున్నానని తెలిపారు. ఇప్పటికే అమ్మ వారసత్వం కోసం విశాల్ పోటీకి దిగిన నియోజకవర్గం నుంచి గెలుపు కోసం పళనిస్వామి, పన్నీర్‌ సెల్వం వర్గం, శశికళ వర్గం నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. జయలలిత మేనకోడలు దీప కూడా ఇదే నియోజకవర్గం నుంచి నామినేషన్ వేశారు. ఈ సమయంలో విశాల్‌ బరిలోకి దిగటంతో ఆర్‌.కె నగర్‌ ఉపఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఈ నెల 21 న ఆర్కే నగర్‌ పోలింగ్ జరగనుంది.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

మళ్ళీ రావా DEC 8
MCA DEC 21
హలో DEC 22
ఒక్క క్షణం DEC 23
చలో DEC 29

Now Showing

జవాన్ DEC 1
ఆక్సిజన్ NOV 30
బాలకృష్ణుడు NOV 24
mental మదిలో NOV 24
ఖాకి NOV 17

Poll