కోలీవుడ్

మళ్లీ ఇంకో వివాదం, ఇంటి వద్ద పోలీస్ భధ్రత

తమిళ స్టార్‌ శింబు ఎప్పుడూ ఏదో వివాదంలో ఉండటం పరిపాటి అయ్యిపోయింది. ఆ మధ్యన బీప్ సాంగ్ తో పెద్ద గొడవలో ఇరుక్కుని పోలీస్ కేసులు గట్రా ఎదుర్కొన్న శింబు మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. ఆయన తాజా సినిమా చిత్రం ‘థత్రోం థూక్రోం’. ఈ చిత్రంలోని ఓ పాటను పెద్ద నోట్లరద్దును ప్రకటించి ఏడాది పూర్తైన సందర్భంగా విడుదల చేశారు. దీన్ని శింబు ఆలపించారు.

ఈ పాటలో పెద్ద నోట్లరద్దు, జీఎస్టీ విధానాన్ని విమర్శించారు. వివిధ బ్యాంకుల్లో లోన్‌లు ఎగ్గొట్టి, విదేశాలకు పారిపోయిన విజయ్‌మాల్యా గురించి కూడా ఇందులో ప్రస్తావించారు. అలాంటి వారు పారిపోతుంటే సామాన్య ప్రజలు మాత్రం దేశంలోనే ఉంటూ ఇబ్బందులు పడుతున్నారని ఈ పాటలో పేర్కొన్నారు.

ఇప్పుడు ఇది కాస్త వివాదానికి దారి తీసింది. ఈ పాటపై సోషల్‌మీడియాలో కొందరు నెటిజన్లు జోక్స్‌ వేస్తుంటే, మరికొందరు విమర్శిస్తున్నారు. భాజపా నేతలు శింబు ఇంటి ముందు ఆందోళన చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు ఆయన ఇంటికి భద్రత ఏర్పాటు చేశారు. ఈ పాట వివాదంపై శింబు స్పందించారు. ఈ పాటను తాను రాయలేదన్నారు.

శింబు మాట్లాడుతూ…‘ఈ పాటలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రస్తావించారు కాబట్టి పాడాలని నిర్ణయించుకున్నా. ఇందులో తప్పేమీలేదు. పెద్ద నోట్ల రద్దు సమయంలో ప్రజలు నిజంగా అనేక కష్టాలు పడ్డారు. దాన్నే ఈ పాటలో చెప్పాం. ఇతరుల మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో మా యూనిట్ ఈ పాటను రాయలేదు’ అని చెప్పారు.

రీసెంట్ గా విడుదలైన విజయ్‌ ‘మెర్సల్‌’(తెలుగు అదిరింది) చిత్రం కూడా అనేక వివాదాలు ఎదుర్కొంది. చిత్రంలో జీఎస్టీ గురించి తప్పుగా చూపించారని భాజపా నేతలు ఆందోళన చేపట్టారు. సినిమాను నిషేధించాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో చెన్నైకు చెందిన ఓ న్యాయవాది ‘మెర్సల్‌’ను నిషేధించాలని మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ‘మెర్సల్‌’ తెలుగు వెర్షన్‌ ‘అదిరింది’లో జీఎస్టీకు సంబంధించిన డైలాగ్‌ను మ్యూట్‌ చేశారు.

Comments

comments

Teaser

Trailer

song

Coming Soon

లండన్ బాబులు

Now Showing

ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll