టాలీవుడ్

ఇవి కమ్మ అవార్డులు..

Nallamalupu Bujjiఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన నంది అవార్డ్స్ పై రగడ రోజు రోజుకి పెరుగుతున్న సంగతి తెలిసిందే. సినీ ప్రముఖులు సైతం మీడియా ముందుకు వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఏపీ నంది అవార్డ్స్ పై అల్లు అర్జున్ నటించిన రేసుగుర్రం మూవీ నిర్మాత నల్లమలుపు బుజ్జి ఆవేదనతో ఆవేశంగా మాట్లాడారు. మొత్తం కమ్మ కులం వాళ్లకే ఇచ్చారని.. అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

నల్లమలుపు బుజ్జి మాట్లాడుతూ…ప్రభుత్వం, కమిటీ మెంబర్లు ఏకపక్షంగా నచ్చినవారికి అవార్డులు ఇచ్చుకుంటూ వెళ్లిపోయారని విమర్శించారు. అల్లు అర్జున్ కు హీరోగా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవార్డు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. రేసుగుర్రం సినిమా అనేక వేదికలపై అవార్డులను గెలుచుకుందని… కానీ, నంది అవార్డు రాకపోవడం బాధగా ఉందని చెప్పారు. హిట్ సినిమా తీసి, అవార్దు రాకపోతే దాని బాధ ఏంటో తెలుస్తుందని అన్నారు.

అంతేకాకుండా నిర్మాత సి.కల్యాణ్ పిచ్చిగా మాట్లాడుతున్నారని… ఆయనకు ఒకటే చెబుతున్నానని… ‘ముందు హిట్ సినిమా తీయండి, ఆ తర్వాత మాట్లాడండి’ అని అన్నారు. తమ రేసుగుర్రం సినిమా రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసిందని… అంత ప్రజాదరణ పొందిన సినిమాకు అవార్డు ఇవ్వకపోతే ఎలాగని అన్నారు. తన కెరియర్ లోనే రేసుగుర్రం అతి గొప్ప సినిమా అని చెప్పారు.

తమ కంటితుడుపు కోసం ఏవో రెండు అవార్డులు ఇచ్చి, సరిపెట్టుకున్నారని అన్నారు. ప్రజలు మెచ్చిన సినిమాను ప్రభుత్వం కూడా గుర్తించాలని చెప్పారు. తమ కష్టాన్ని ప్రభుత్వం గుర్తిస్తేనే… తమకు ఇంకా మంచి సినిమాలు తీయాలనే తపన కలుగుతుందని తెలిపారు. ఎప్పడూ మీడియా ముందుకు రాని తాను ఇప్పుడు మాట్లాడుతున్నానంటే దానికి కారణం కడుపుమండటమే అని చెప్పారు.

నంది అవార్డులు మొత్తం కమ్మ లాబీయింగ్ లా ఉందని… ఇవి కమ్మ అవార్డుల్లా ఉన్నాయని తెలిపాడు. రుద్రమదేవిలాంటి చారిత్రక సినిమాకు అవార్డు ఇవ్వలేదని.. శాతకర్ణిలాంటి సినిమాలకైతే ఇచ్చుకుంటారని చెప్పాడు. బాహుబలి సినిమాలో ప్రభాస్ కు అవార్డ్ ఇవ్వచ్చు కదా అని అన్నారు.

Comments

comments

Teaser

Trailer

song

Coming Soon

లండన్ బాబులు 17

Now Showing

ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll