టాలీవుడ్

తనపై కేసు పెట్టడంపై ప్రకాష్ రాజ్ స్పందన ఇదీ…

Prakash Rajపాత్రికేయురాలు గౌరీలంకేశ్‌ హత్య విషయంలో ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తూ ప్రకాశ్‌రాజ్‌ వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. గౌరీ లంకేశ్ హత్య ఉదంతంపై ప్రధాని మోడీ స్పందించని వైనాన్ని ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ప్రస్తావించటమే కాదు.. మోడీ నటిస్తే తాను తెలుసుకోలేనా? అన్న మాటను కూడా మాట్లాడారు. తాను పెద్ద నటుడినని.. తన లాంటి నటుడికి.. వేరే వారు నటిస్తే అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటానని అనుకోకూడదని చెబుతూ.. గౌరీ లంకేశ్ ఉదంతంపై ప్రధాని మోడీ రియాక్ట్ కాకపోవటంపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారటం తెలిసిందే. ఓ ప్రధానిని ఉద్దేశించి అలా అనడం సబబు కాదంటూ లఖ్‌నవూకు చెందిన ఓ న్యాయవాది ఆయనపై కేసు దాఖలు చేశారు.

తాజాగా ఈ విషయమై ప్రకాష్ రాజ్‌ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘ఎప్పుడైనా, ఎక్కడైనా నేను నిజమే మాట్లాడతా. మోదీ విషయంలోనూ నేను నిజమే మాట్లాడాను. అంతమాత్రానికే నన్ను యాంటీ మోదీ అనేస్తారా? ఆయన మన ప్రధాని. ఆయనపై నాకు గౌరవం ఉంది. కానీ కొన్ని విషయాల్లో మోదీతో ఏకీభవించలేను. నన్ను నోటికొచ్చినట్లు తిడుతున్న వారికి నా ఎదురుగా వచ్చి సమాధానం చెప్పే ధైర్యం లేదు. ఇంత జరిగినా ఇప్పటికీ నా మాటలపైనే నిలబడతా.’ అని చెప్పుకొచ్చారు ప్రకాష్ రాజ్.

గౌరీ లంకేశ్‌ కుటుంబంతో ప్రకాశ్‌ రాజ్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆమె హత్యకు గురై రోజులు గడుస్తున్నా ఇంకా నిందితులను పట్టుకోకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

లండన్ బాబులు

Now Showing

మహానుభావుడు SEP 29
స్పైడర్ SEP 27
జై లవ కుశ SEP 21
ARJUN REDDY AUG 25

Poll