టాలీవుడ్

బన్ని వాసు ..ఈసారి రజనీ సినిమాపై వార్

bunny vasఆ మధ్యన నంది అవార్డుల విషయంలో మెగా హీరోలకు అన్యాయం జరిగిందంటూ నిర్మాత బన్నీ వాసు సోషల్ మీడియాలో వాపోయి వివాదం రాజేసిన సంగతి తెలిసిందే. ఆయన రేపిన ఈ వివాదంతో ఇండస్ట్రీలోని ఇతర సెలబ్రిటీలు కొందరు ఈ అవార్డులపై పెదవి విరిచారు. తాజాగా మరో వివాదానికి బన్నీ వాసు తెరలేపారు. లైకా ప్రొడక్షన్స్ నుండి 2.0 మూవీ విడుదలపై వచ్చిన అఫీషియల్ ప్రకటనతో బన్నీ వాసు ఫైరవ్వటం ఆసక్తికరంగా మారింది.

“లైకా ప్రొడక్షన్స్ వారికి.. మీ మూవీని మేం గౌరవిస్తాం. కానీ విడుదల తేదీని మీరు మార్చడం వల్ల మా ప్రాంతీయ సినిమాలపై ఆ ప్రభావం ఎంతగానో పడుతోంది. ఇప్పటికే రిలీజ్ డేట్ కోసం నేను, దానయ్యగారు చర్చల్లో ఉన్నాం. ఈ వ్యవహారాన్ని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌తో పాటు ఏపీ, తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్తాను. చెప్పిన రిలీజ్ డేట్‌కు మేం కట్టుబడి ఉన్నాం. భవిష్యత్తులో ప్రాంతీయ సినిమాల విడుదలకు మా ఈ ప్రయత్నం సహాయపడుతుందని ఆశిస్తున్నాను” అంటూ బన్నీ వాసు ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.

ఈ గొడవకు కారణం ఇదీ..

రజనీకాంత్‌ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం ‘2.ఓ’. అమీజాక్సన్‌ కథానాయిక. అక్షయ్‌కుమార్‌ ప్రతినాయక ఛాయలున్న పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ముఖ్యంగా వీఎఫ్‌ఎక్స్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్నీ పూర్తయితే 2018 జనవరి 26న సినిమా విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. అయితే వీఎఫ్‌ఎక్స్‌ పనులు ఇంకా పూర్తయ్యే సూచనలు కనిపించకపోవడంతో తాజాగా సినిమా విడుదలను 2018 ఏప్రిల్‌ నెలకు మార్చారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ ఓ ప్రకటన వెలువరించింది.

ఇప్పటికే ఏప్రిల్ 27వ తేదీ కోసం బన్నీ వాసు, దానయ్యల మధ్య చర్చలు జరుగుతున్నాయనే విషయం తెలిసిందే. వీరిలో ముందుగా తేదీని ప్రకటించింది మాత్రం బన్నీ వాసే. ఆయన నిర్మిస్తున్న ‘నా పేరు సూర్య’ చిత్రం ఏప్రిల్ 27న థియేటర్లలోకి వస్తుందంటూ ముందుగానే ప్రకటించారు. అయితే మరుసటి రోజే మహేష్ బాబు తన సినిమా ‘భరత్ అనే నేను’ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. ఏప్రిల్ 27న కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదల అంటూ ప్రకటన విడుదల చేశారు. అయితే ఇద్దరు పెద్ద హీరోల చిత్రాలు ఒకే రోజు విడుదలవడం ఇండస్ట్రీకి మంచిది కాదనే ఉద్ధేశ్యంతో నిర్మాతలిద్దరూ ఏదో ఒక చిత్రాన్ని ఈ తేదీ కంటే ముందో, వెనుకో రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. తాజాగా ఇదే డేట్‌కి జనవరి 26న వస్తుందనుకుంటున్న రజినీకాంత్ 2.0 చిత్రం విడుదల అని ప్రకటన రావడంతో.. బన్నీ వాసు ఇలా స్పందించారు. దానయ్య కూడా ఈ విషయంలో సీరియస్‌గా ఉండటం విశేషం.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

జవాన్ DEC 1
MCA DEC 21
హలో DEC 22
చలో DEC 29

Now Showing

ఆక్సిజన్ NOV 30
బాలకృష్ణుడు NOV 24
mental మదిలో NOV 24
ఖాకి NOV 17
లండన్ బాబులు 17 NOV 17
గృహం NOV 10
ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll