టాలీవుడ్

మెగా హీరోలకు అన్యాయమే జరిగింది, తట్టుకోలేకే ప్రశ్నిస్తున్నా

bunny vasనంది అవార్డుల విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి తీరని అన్యాయం జరిగిందని బన్నీ వాసు ఆవేదన వ్యక్తం చేశారు. గీతా ఆర్ట్స్ గ్రూప్ లో కీలక వ్యక్తిగా ఉన్న బన్ని వాసు… నంది అవార్డ్ ల ఎంపికపై తన నిరసన ప్రకటించారు. మూడేళ్లకు ప్రకటించిన నంది అవార్డుల్లో మెగా కుటుంబానికి చెందిన ఒక్క హీరోకు కూడా ఉత్తమ నటుడు అవార్డు రాకపోవటం ఏమిటని అసహనం వ్యక్తం చేశాడు.

బన్ని వాసు మాట్లాడుతూ..ఈ మూడేళ్ల కాలంలో మెగా హీరోలు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారని చెప్పాడు. రెండు కమర్షియల్ హిట్స్ ఇచ్చిన అల్లు అర్జున్ కు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు ఇవ్వడమేంటని ప్రశ్నించాడు. ఇది ముమ్మాటికీ మెగా ఫ్యామిలీని అవమానించడమేనని చెప్పాడు. చిరంజీవి ఫ్యామిలీ ఈ విషయాన్ని పట్టించుకోలేదని… అయినప్పటికీ, ఆవేదనను తట్టుకోలేక తాను ప్రశ్నిస్తున్నానని తెలిపాడు.

గతంలో మగధీర సినిమాకు కూడా అన్యాయం జరిగిందని… జాతీయ స్థాయిలో ఈ సినిమాకు గుర్తింపు లభించినా, రాష్ట్ర స్థాయిలో మాత్రం గుర్తింపు దక్కలేదని బన్నీ వాసు అన్నాడు. ఈ మూడేళ్ల అవార్డుల గురించి మాత్రమే తాను మాట్లాడటం లేదని… చిరంజీవి కుటుంబానికి గత కొన్నేళ్లుగా అన్యాయం జరుగుతోందని చెప్పాడు. కొన్నేళ్లుగా సినీ పరిశ్రమకు 50 శాతం ఆదాయం మెగా ఫ్యామిలీ నుంచే వస్తోందని అన్నారు.

ఇక ఈ నంది అవార్డ్ ల విషయంలో ..బాలయ్య లెజెండ్ కి ఇన్ని అవార్డులు రావడం మీద విమర్శలు ఒక ఎత్తు అయితే బన్నీ వాసు చేసిన సెటైర్ సోషల్ మీడియాలో బాగా పేలింది. మెగా హీరోలు ఏపీ సర్కార్ దగ్గర నటన నేర్చుకోవాలి అని బన్నీ వాసు కామెంట్ తో ఒక్క సారిగా అంతటా హీట్ పెరిగింది.

Comments

comments

Teaser

Trailer

song

Coming Soon

లండన్ బాబులు 17

Now Showing

ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll