బాలీవుడ్

ఇంకో బయోపిక్ …విషప్రయోగం జరిగిందో లేదో తేలుస్తారట

Lal-Bahadur-Shastri-ili-80-img-2బాలీవుడ్‌ లో వరస పెట్టి బయోపిక్‌ల ప్రకటిస్తూనే ఉన్నారు. ఇప్పటికే క్రీడాకారులైన మేరీకోమ్‌, మహావీర్‌ సింగ్‌ ఫోగట్‌ వంటి వాళ్ల జీవిత చరిత్రలు తెరకెక్కాయి. బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనానెహ్వాల్‌పై చిత్రం షూటింగ్‌ దశలో ఉంది. అయితే, ఇప్పడు భారత రెండో ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి జీవిత చరిత్రను తెరకెక్కించటానికి సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు, సీబీఎఫ్‌సీ సభ్యుడైన వివేక్‌ అగ్నిహోత్రి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

ఇండియా-పాకిస్థాన్‌ యుద్ధంలో భారత్‌ గెలిచిన అనంతరం జరిగిన తాష్కెంట్‌ ఒప్పందం తర్వాత కొద్ది గంటలకే శాస్త్రి మృతి చెందారు. దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన ఈఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తీయనున్నారు. 1966 జనవరి 11న ఆయన మరణించారు.52ఏళ్ల నుంచి ఇప్పటి వరకు ఆయన చనిపోవడానికి గల కారణాలను ఎవరూ విశ్లేషించలేకపోయారు.

ఆయన గుండెపోటుతో చనిపోయారా లేదా ఆయనపై విషప్రయోగం ఏమైనా జరిగిందా అనే అంశాలన్నీ ఈ చిత్రంలో ఉంటాయని వివేక్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు. ఇప్పటికే ఈ చిత్రంలో నటించడానికి జాతీయ అవార్డుగ్రహీతలైన నజ్రుద్దీన్‌, మిథున్‌ అంగీకరించారని వివేక్‌ తెలిపారు. ఎన్నో ఏళ్ల తర్వాత వాళ్లిద్దరూ తెరమీద కన్పించనున్నారు. ఇందులో నటించబోయే ఇతర తారాగణాన్ని త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16