టాలీవుడ్

తెలంగాణా భాషను అవమానించావంటూ… బిత్తిరి సత్తిపై దాడి

bittari sattiV6 ఛానల్‌లో ప్రసారమయ్యే ‘తీన్మార్‌’తో గుర్తింపు పొందిన బిత్తిరి సత్తిపై ఓ యువకుడు దాడి చేసారు. ఈ ఘటనలో సత్తికి గాయాలయ్యి హాస్పటిల్ లో చేరారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

4పోలీసుల కథనం ప్రకారం… సోమవారం మధ్యాహ్నం బిత్తిరి సత్తి బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యేకాలనీలో గల ఛానల్‌ కార్యాలయానికి కారులో డ్రైవర్‌తో కలిసి రోజూలాగే వచ్చారు. డ్రైవర్‌ కారు ఆపగానే కార్యాలయంలోకి వెళ్లేందుకు సత్తి కారు దిగారు. అప్పటికే అక్కడ ఉన్న సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ ప్రాంతంలోని కళాసిగూడకు చెందిన మణికంఠగౌడ్‌ (26) సత్తిపై పిడుగుద్దులు కురిపించాడు. తెలంగాణ భాషను అవమానించేలా నీ మాటలు ఉన్నందున దాడి చేస్తున్నానని, ‘తీన్మార్‌’ కార్యక్రమం ద్వారానే ప్రజలకు క్షమాపణ చెప్పాలని మణికంఠగౌడ్‌ కేకలు వేశాడు. ఆ సమయంలో ఆ పక్కనే ఉన్న కొందరు మణికంఠగౌడ్‌ను పట్టుకుని చితకబాదారు.

ఓ వ్యక్తి తన హెల్మెట్ తో నిందితుడిపై దాడి చేశాడు. అందరూ నిందితుడిని కదలనివ్వకుండా పట్టుకుని బంజారాహిల్స్‌ పోలీసులకు అప్పగించారు. దాడిలో గాయపడిన బిత్తిరి సత్తిని బంజారాహిల్స్‌లోని స్టార్‌ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. సత్తి ఫిర్యాదు మేరకు మణికంఠగౌడ్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాస్‌ తెలిపారు. మణికంఠగౌడ్‌ను ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాస్‌ వివిధ కోణాల్లో విచారించారు. అతనికి మతి స్థిమితం లేదని కుటుంబీకులు చెప్తున్నారు. అయితే అతను తాను కాబోయే తెలుగు సినిమా దర్శకుడుని అని చెప్పటం జరిగింది. అంతేగాక, తాను మాస్ కమ్యూనికేషన్ చేశానని, సికింద్రాబాద్‌లోనే సొంత ఇల్లు ఉందని చెప్పుకొచ్చాడు. తెలంగాణ భాషను అవమానించినందుకే దాడి చేశానని స్పష్టం చేశాడు.

బెల్లితెరపై బిత్తిరి సత్తిగా అందరికీ సుపరిచితమైన సత్తి అసలు పేరు చేవేళ్ల రవి. రంగారెడ్డి జిల్లా పమేనా గ్రామానికి చెందిన వాడు. చిన్నతనం నుండి ప్రముఖులను ఇమేట్ చేస్తూ అందరినీ ఎంటర్టెన్ చేసేవాడు. అతనిలోని ఆ టాలెంటే ఇపుడు అతన్ని పెద్ద సెలబ్రిటీ చేసింది.

Comments

comments

Teaser

Trailer

Teaser 2

Coming Soon

ఆక్సిజన్ NOV 30
జవాన్ DEC 1
MCA DEC 21
హలో DEC 22
చలో DEC 29

Now Showing

బాలకృష్ణుడు NOV 24
mental మదిలో NOV 24
ఖాకి NOV 17
లండన్ బాబులు 17 NOV 17
గృహం NOV 10
ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll