టాలీవుడ్

భూమిక ..తెలుగులో ఇంకో సినిమాలోనూ

bhumikaప‌వ‌న్ క‌ల్యాణ్‌, మ‌హేష్‌బాబు, ఎన్టీఆర్.. ఇలా వరసపెట్టి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా చేసి ఆ తర్వాత హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల‌తోనూ మెప్పించింది. అనంతరం వివాహం చేసుకుని రిటైర్ అయిపోయిన భూమిక… మళ్లీ చాలా గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చింది. రీసెంట్ గా నాని చిత్రం ‘ఎం.సి.ఎ’లో నానికి వ‌దిన‌గా న‌టించిన భూమిక‌కి ఆ చిత్రం మంచి పేరే తీసుకువ‌చ్చింది. టాక్‌తో సంబంధం లేకుండా ఈ సినిమా మంచి వ‌సూళ్లు రాబ‌ట్టుకుంటోంది.

ఇదిలా ఉంటే.. నాగ‌చైత‌న్య హీరోగా చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో ‘స‌వ్య‌సాచి’ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భూమిక ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నుంది. ఈ విషయం భూమిక ఖరారు చేసి తెలిపింది. మాధవన్ సరసన ఆమె కనిపించనుందని తెలుస్తోంది. ఆమెది చిన్న పాత్ర అయినా కీ రోల్ అంటున్నారు. కీర‌వాణి సంగీత‌మందిస్తున్న ఈ చిత్రంలో త‌మిళ‌న‌టుడు మాధ‌వ‌న్ విలన్ గా క‌నిపించ‌నున్నారు.

ఇదే సమయంలో మరో విషయం గుర్తు చేసుకోవాలి… అసలు ..భూమిక‌ని తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేసింది నాగార్జున‌నే. నాగ్ నిర్మించిన‌ ‘యువ‌కుడు’ చిత్రంతో హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైన భూమిక‌.. ఆ చిత్రంలో సుమంత్‌కి జోడీగా న‌టించింది. ఆ త‌రువాత నాగ్‌తో ‘స్నేహ‌మంటే ఇదేరా’ చేసిన భూమిక‌.. ఇప్పుడు ఆయ‌న కుమారుడు నాగ‌చైత‌న్య చిత్రంలో ఓ కీల‌క పాత్ర పోషించే అవ‌కాశం ద‌క్కించుకోవ‌డం విశేషం. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక స‌మాచారం వెలువడుతుంది.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16