టాలీవుడ్

రేప్ కేసులో స్టార్ హీరో అరెస్టు

manojనటిపై రేప్ , ఫోర్జరీ ఆరోపణలపై బోజ్‌పురి నటుడు మనోజ్‌ పాండేను ఛర్కాప్ పోలీసులు అరెస్టు చేశారు. థానే సమీపంలోని కల్యాణ్ వద్ద మనోజ్ పాండే షూటింగ్‌లో ఉండగా పోలీసులు ఆయనను అదుపులోనికి తీసుకున్నారు. మనోజ్‌పాండే తనను పెళ్లి చేసుకుంటానని ఆశ చూపడంతో ఐదేళ్లుగా తాము సహజీవనం చేస్తున్నామని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.

భోజ్‌పురి పరిశ్రమలో తాను నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉండగా 2012లో పాండే తారసపడ్డాడని, తానో స్టార్‌నని, తన పక్కన అవకాశాలు ఇప్పిస్తానని, పెళ్లి చేసుకుంటానని నమ్మంచి ఐదేళ్లలో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, 2015లో తాను మూడు నెలలు గర్భవతిగా ఉండగానే బలవంతంగా అబార్షన్ చేయించాడని ఆమె ఆరోపించింది. తన సొమ్ముతోనే పాండే ఇల్లు కొన్నాడని, తనతో ఉంటూనే బయటవారితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడని పేర్కొంది.

కొద్దిరోజుల క్రితం ఓ మహిళ తానను కలిసి తానో బీజేపీ నాయకుడి కుమార్తెనని, తనను పాండే పెళ్లి చేసుకున్నందున ఇల్లు వదిలిపెట్టి వెళ్లాలని చెప్పడంతో తాను షాక్ తిన్నానని చెప్పింది. కాగా, నటుడు, గాయకుడైన మనోజ్ పాండే ‘లహరియ లూట్ ఆయా రాజా జీ’, ‘సౌగంధ్ గంగా మ్యయా కే’, ‘లాల్ చునరియా వాలి’, ‘బల్లియా కే దబంగయి’ వంటి పలు భోజ్‌పురి హిట్ చిత్రాల్లో నటించాడు. తన పేరుతో పలు వీడియో ఆల్బమ్స్‌ కూడా తీశాడు

Comments

comments

Trailer

Promo

song

Coming Soon

స్పైడర్ SEP 27
మహానుభావుడు SEP 29
లండన్ బాబులు

Now Showing

జై లవ కుశ SEP 21
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18

Poll