టాలీవుడ్

‘భరత్‌ అనే నేను’ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

bharat anuసూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటించిన చిత్రం భరత్ అనే నేను. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని ఏప్రిల్ 20న రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ నేపధ్యంలో థియేట్రికల్ హక్కులతో సహా మొత్తం బిజినెస్ ఫినిష్ చేసినట్లు సమాచారం. మహేష్ కెరీర్ లోనే ఎక్కువ బిజినెస్ అయిన చిత్రం ఇదే అని తెలుస్తోంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం.. కేవలం తెలుగు వెర్షన్ కు సంబంధించి.. ప్రపంచ వ్యాప్తంగా 99 కోట్లు బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు కెరియర్లో ఈ రేంజ్ ఫిగర్ రావడం సరికొత్త రికార్డు.

ఏరియా ప్రీ రిలీజ్ బిజినెస్

నైజాం 22 కోట్లు

సీడెడ్ 12 కోట్లు

ఉత్తరాంథ్ర 8.7 కోట్లు

ఈస్ట్ గోదావరి 6.70 కోట్లు

కృష్ణా-గుంటూరు 13.6 కోట్లు

వెస్ట్ గోదావరి 6 కోట్లు

నెల్లూరు 3 కోట్లు

టోటల్ ఆంధ్రా,తెలంగాణా కలిపి 72 కోట్లు

కర్ణాటక,తమిళనాడు, నార్త్ ఇండియా 9 కోట్లు

ఓవర్ సీస్ 18 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా టోటల్ బిజినెస్ 99 కోట్లు

మహేష్ బాబు ఇందులో సీఎం పాత్రలో కనిపిస్తుండడంతో మొదట్నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు సినిమా బ్లాక్ బస్టర్ కావడం..రెండో సారి మహేష్ తో సినిమా చేయడం వల్ల మంచి మార్కెట్ ఏర్పడింది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ , పాటలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని సినిమా కోసం ఎదురుచూసేలా చేస్తోంది. ఈ సినిమాలో మహేష్ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటించగా, దేవి శ్రీ ప్రసాద్ ఎనర్జిటిక్ ట్యూన్స్ ను అందించారు.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16