టాలీవుడ్

‘బాహుబలి’రికార్డ్ బ్రద్దలు కొట్టడానికి ‘భరత్‌ అనే నేను’ భారీ స్కెచ్ ఇదే

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటించిన చిత్రం ‘భరత్‌ అనే నేను’. కొరటాల శివ దర్శకత్వం వహించారు. కైరా అడ్వాణీ హీరోయిన్. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందించారు. చిత్రం ఏప్రిల్‌ 20న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమాను విదేశాల్లో భారీ స్థాయిలో విడుదల చేయడానికి యుఎస్ డిస్ట్రిబ్యూటర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

అమెరికాలో మొత్తం 320కిపైగా లొకేషన్లలో సినిమాను ప్రదర్శించనున్నారని సమాచారం. 2000లకుపైగా స్క్రీన్లలో చిత్రం ప్రీమియర్‌ను నిర్వహించనున్నట్లు సమాచారం. ఫస్ట్ వీకెండ్ కి మొత్తం 10 వేల షోలను ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే ‘బాహుబలి’ తర్వాత అమెరికాలో భారీ వసూళ్లు సాధించిన సినిమాల రికార్డును బద్దలు కొట్టడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.

మరో ప్రక్క మహేష్ కెరీర్ లోనే ఎక్కువ బిజినెస్ అయిన చిత్రం ఇదే అని తెలుస్తోంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం.. కేవలం తెలుగు వెర్షన్ కు సంబంధించి.. ప్రపంచ వ్యాప్తంగా 99 కోట్లు బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు కెరియర్లో ఈ రేంజ్ ఫిగర్ రావడం సరికొత్త రికార్డు.

ఇటీవల విడుదల చేసిన ‘భరత్‌ అనే నేను’ చిత్రం ఆడియోకు అద్బుతమైన రెస్పాన్స్ లభించింది. యూట్యూబ్‌లో సినిమా జూక్‌ బాక్స్‌ను 10 లక్షల మందికిపైగా విన్నారని తాజాగా చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ సినిమాలో మహేశ్‌ ముఖ్యమంత్రి పాత్రలో అలరించనున్నారు. ‘స్పైడర్‌’ తర్వాత మహేశ్‌ నుంచి వస్తోన్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16