బాక్స్ ఆఫీస్

ఈ న్యూస్ ఖచ్చితంగా షాక్ ఇస్తుంది

anushka-bhagamathi‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ తర్వాత అనుష్క చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అనుష్క టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘భాగమతి’. జి. అశోక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దాంతో ఈ చిత్రానికి ఓ రేంజిలో క్రేజ్ వచ్చింది. బిజినెస్ కూడా ఊపందుకుంది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా తమిళ హక్కులను స్టూడియో గ్రీన్ సంస్థ 15కోట్లకు కొనుగోలు చేసింది. ఈ రేటు రెగ్యులర్ స్టార్ హీరోల సినిమా స్దాయిని దాటేసింది. దాంతో అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు.

బాహుబలి సినిమా తరువాత అనుష్క మార్కెట్ భారీగా పెరిగటమే కారణం అంటున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

నిర్మాతలు మాట్లాడుతూ ‘‘బాహుబలి’తో ఎంతో పేరు తెచ్చుకొన్న అనుష్కతో ‘భాగమతి’ తీస్తున్నందుకు గర్వంగా ఉంది. ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన లభిస్తోంది. సినిమాపై అంచనాలు కూడా పెద్దయెత్తున పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే దర్శకుడు అశోక్‌ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. అనుష్క నటన, మది కెమెరా పనితనం, తమన్‌ సంగీతం చిత్రానికి ప్రధాన బలం. కొత్త తరహాలో సాగే ‘భాగమతి’ కథ, కథనం తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు.

ఉన్ని ముకుందన్‌, జయరాం, ఆశా శరత్‌, మురళీశర్మ, ధన్‌రాజ్‌, ప్రభాస్‌ శ్రీను, విద్యుల్లేఖ రామన్‌, దేవ దర్శిని, తలైవాసల్‌ విజయ్‌, అజయ్‌ ఘోష్‌, మధు నందన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కళ: రవీందర్‌

Comments

comments

Teaser

Trailer

Teaser 2

Coming Soon

ఆక్సిజన్ NOV 30
జవాన్ DEC 1
MCA DEC 21
హలో DEC 22
చలో DEC 29

Now Showing

బాలకృష్ణుడు NOV 24
mental మదిలో NOV 24
ఖాకి NOV 17
లండన్ బాబులు 17 NOV 17
గృహం NOV 10
ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll