టాలీవుడ్

హఠాత్తుగా ఎన్టీఆర్ ని భజన,అసలు ఆలోచన ఏంటో ?

ntr-bandlaఎన్టీఆర్ కెరీర్ లోనే ఆల్ టైం రికార్డ్ కలెక్షన్లు కొల్లగొడుతూ ముందుకు సాగుతోంది జైలవకుశ చిత్రం. ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రిభినయం చేసిన ఈ సినిమాలో జై పాత్రకు ఎన్టీఆర్ పడిన కష్టానికి తగిన ఫలితం దక్కిందనే అందరూ అంటున్నారు. ఈ నేపధ్యంలో ‘జై లవ కుశ’ చిత్రంపై నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రం బాగుందని, జూనియర్ ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉందని తన ట్విట్టర్ ఖాతాలో కితాబిచ్చారు.

‘జై లవ కుశ’ సినిమా రాత్రి చూశానని, నిద్ర పట్టలేదని, ఎన్టీఆర్, ఎస్వీఆర్ తర్వాత తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తారక్ యేనని ప్రశంసించారు. ఎన్టీఆర్, మరికొందరు నటుల తర్వాత ఆ స్థాయిలో అద్భుతంగా నటించిన మా బాద్ షాకి హృదయపూర్వక ధన్యవాదాలని తన పోస్ట్ లో పేర్కొన్నారు.

గతంలో ఎన్టీఆర్ నటించిన బాద్ షా – టెంపర్ సినిమాలకు బండ్ల గణేష్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. తరవాత బండ్ల గణేష్ కు – ఎన్టీఆర్ మధ్య గ్యాప్ వచ్చి అప్పటి నుంచి అతడిని దూరం పెట్టడం మొదలెట్టాడు. అలాంటిది మళ్లీ ఇప్పుడు ఉన్నట్టుండి ఎన్టీఆర్ భజన మొదలెట్టారు. ఇది చూసి అభిమానులకు డౌట్ పట్టుకుంది.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

మహానుభావుడు SEP 29
లండన్ బాబులు

Now Showing

స్పైడర్ SEP 27
జై లవ కుశ SEP 21
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18

Poll