టాలీవుడ్

అప్పుడు హస్తం..ఇప్పుడు సైకిల్ అన్యాయం

nandiఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లకు ఒకేసారి నంది అవార్డులను ప్రకటించడం.. వాటిలో నందమూరి ఫ్యామిలీకే ఎక్కువ అవార్డులు దక్కడంతో మెగా ఫ్యామిలీని కావాలనే సైడ్ చేశారనే విమర్శలు మొదలయ్యిన సంగతి తెలిసిందే. తాజాగా నిర్మాత బండ్ల గ‌ణేష్ ఈ అవార్డుల ఎంపిక తీరును ఎండ గ‌ట్టాడు.. నంది అవార్దుల కావ‌ని, అవి సైకిల్ అవార్డులంటూ ఫైర్ అయ్యాడు.తాను గతంలో నిర్మించిన గోవిందుడు అందరివాడే చిత్రానికి ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా అవార్డు దక్కకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. , లెజెండ్ సినిమా బ్లాక్ బస్టర్ అని నేను ఒప్పుకుంటాను. నా సినిమా గోవిందుడు అందరివాడే యావరేజ్ గా ఉండొచ్చు

కానీ, ఈ చిత్రంలో రామ్ చరణ్ ఎంతో అద్భుతంగా నటించాడు, అతనికి అవార్డు వస్తుందనుకున్నా. జ్యూరీ సభ్యులను ఈ సినిమా మరోమారు చూడాలని కోరుకుంటున్నా అని అన్నాడు. గోవిందుడు అందరివాడే కథ బాగుందని ఓ అవార్డు, చిరంజీవికి రఘపతి వెంకయ్యనాయుడు అవార్డు ఇవ్వడం అన్నది ఏదో కంటితుడుపు చర్యగా అభివ‌ర్ణించాడు.

నాడు హ‌స్తం పార్టీ అధికారంలో ఉండ‌గా మ‌గ‌ధీర లో రామ్ చ‌ర‌ణ్ న‌ట‌న‌కు అవార్డు రాకుండా అన్యాయం జ‌రిగితే, ఇప్ప‌డు సైకిల్ పార్టీ కూడా గోవిందుడు అంద‌రి వాడు మూవీలో న‌ట‌న‌కు గానూ రామ్ చ‌ర‌ణ్ కు అవార్డు రాకుండా అడ్డుప‌డిందంటూ ఆరోపించాడు బండ్ల గ‌ణేష్.. అవార్డుల ఎంపిక‌లో మాత్రం మెగా ఫ్యామిలీకి తీర‌ని అన్యాయం జ‌రిగిందంటూ ఆయ‌న స్ప‌ష్టంగా చెప్పాడు..

ఇక గుణ శేఖ‌ర్ తీసిన రుద్ర‌మ‌దేవి సినిమాను అస‌లు ప‌ట్టించుకోక‌పోవ‌డం ప‌ట్ల ఆ చిత్ర నిర్మాత‌, ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ బ‌హింరంగం గానే ఎపి ముఖ్య‌మంత్రికి లేఖ రాశాడు.. ఎపి ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు వియ్యంకుడు, హీరో బాల‌కృష్ణ మూవీ గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణికి ఎపిలో ప‌న్ను మిన‌హాయింపు ఇచ్చి, త‌న రుద్ర‌మ దేవి మూవీ ఇవ్వ‌క‌పోవడం పై తాను ప్ర‌శ్నించినందుకే నంది అవార్డు ద‌క్క‌లేదంటూ ఆయ‌న వాపోయాడు.

‘‘ఎండాకాలం ఎండ కాస్తుంది.. వానాకాలం వానలు పడతాయి.. శీతాకాలం చలేస్తుంది.. అలాగే ఇది టీడీపీ కాలం. వాళ్లేం చెబితే అది వినాలి. లేదా ఇంకో కాలం వచ్చేదాకా వెయిట్ చేయాలంటూ’’ సెటైర్ వేశాడు.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

రంగస్థలం MAR 30
భరత్ అనే నేను APR 20
కాలా APR 27
నా పేరు సూర్య MAY 4

Now Showing

కిరాక్ పార్టీ MAR 16
ఏ మంత్రం వేసావె MAR 9
మనసుకు నచ్చింది FEB 16
అ! FEB 16
తొలిప్రేమ FEB 10
చలో FEB 2