టాలీవుడ్

నోరు జారిన బాలయ్య..అమితాబ్ ఏం పీకారు, చిరుని కూడా …

Balakrishna-Speech‘‘రాజకీయాల్లో రాణించడం ఒక్క రామారావుగారి వల్లే సాధ్యమయింది. అమితాబ్ బచ్చన్ ఉన్నాడు.. ఏం పీకాడు రాజకీయాల్లోకి వచ్చి? ఒక్క గొప్ప పొలిటీషియన్‌ను ఓడించడం తప్ప. ఉత్తర ప్రదేశ్‌లోని అహ్మదాబాద్‌లో బహుగుణ గారిని ఓడించి ఈయన పార్లమెంటుకు వెళ్లాడు. పార్లమెంటులో ఆటోగ్రాఫ్‌లు, ఫొటోలు ఇవ్వడానికి తప్పితే ఎందుకు పనికొచ్చాడు? అంతెందుకు ఇక్కడ చిరంజీవి పరిస్థితి ఏమైంది? రాజకీయాల్లో నిలదొక్కుకోవడం ఎవరివల్లా కాదు. కావాలంటే నేను రాసిస్తాను. నేను సలహా ఇస్తున్నా.. ఆర్టిస్ట్ అనేవాడు రాజకీయాల్లోకి రావొద్దు’’ అని బాలయ్య వ్యాఖ్యానించారు.

పైసా వసూల్ చిత్ర విడుదల సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో బాలకృష్ణ పాల్గొంటున్నారు. ఓ ప్రముఖ టివి ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాలగురించి మాట్లాడుతూ బిగ్ బి అమితాబ్, మెగాస్టార్ చిరంజీవి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలలోకి చాలా మంది సినీ ప్రముఖులు వస్తున్నారు.. వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. వారందరిని మీరు రాజకీయాల్లోకి ఆహ్వానిస్తారా అని బాలయ్యని యాంకర్ ప్రశ్నించింది. దీనికి బాలకృష్ణ సమాధానం ఇస్తూ నోరు జారారు.

‘మీరు హిందూపురానికి..’ అని యాంకర్ ప్రశ్నించేలోపే ‘‘మేము వేరు.. మా బ్లడ్ వేరు.. మా బ్రీడ్‌వింగ్ వేరు. క్రెడిబిలిటీ ఉండాలి. సినిమా స్టార్ ఒకటే సరిపోదు. వేరే హీరోలు సినిమాల్లో చెబితే అది డైలాగ్.. కానీ నేను మాట్లాడేది డైలాగ్ కాదు.. నేనేం మాట్లాడాలనుకున్నానో అది మాట్లాడుతా. నాకు ఎవరైనా నచ్చితే నమస్కారం పెడతా.. లేదంటే వాడు టాటా అయినా.. బిర్లా అయినా సరే కేర్ కూడా చేయను. నా నేచర్ అలాంటిది. మా నాన్న బ్లడ్.. నా సినిమాల క్యారెక్టర్ల ప్రభావం నా నేచర్‌కు కారణాలు.’’ అని బాలకృష్ణ చెప్పారు.

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll