టాలీవుడ్

‘జై సింహా ‘ ప్రీ రిలీజ్ ట్రైలర్

బాల‌కృష్ణ‌, న‌య‌న‌తార జంట‌గా న‌టించిన చిత్రం ‘జై సింహా’. కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ట్రైల‌ర్‌ని ఈ రోజు (సోమ‌వారం) విడుద‌ల చేశారు. అభిమానుల‌ను అల‌రించేలా ఈ ట్రైల‌ర్ ఉంది. చిరంత‌న్ భ‌ట్ సంగీత‌మందించిన ఈ చిత్రాన్ని సి.క‌ల్యాణ్ నిర్మించారు. ఆ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు. అలాగే ఈ ట్రైలర్ తో ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారనే విషయం ఖరారు అయ్యింది.

ఈ ట్రైలర్ లో బాలయ్య నటనతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ కావడం ఖాయం అంటున్నాయి మీడియా వర్గాలు. తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఎం రత్నం మాటలు అందిస్తున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది.

గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో ఆకట్టుకున్న సంగీత దర్శకుడు చిరంతన్ భట్ ఈ సినిమాకు సంగీతం అందిస్తూండటంతో ఆడియోపై మంచి అంచనాలే ఉన్నాయి. సికె ఎంటర్‌టైన్మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్‌పై సీ కళ్యాణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార, నటాషా దోషి, హరి ప్రియలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను బాలయ్య కు తిరుగులేని రికార్డ్‌ ఉన్న సంక్రాంతి సీజన్‌‌లో జనవరి 12న రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
చలో FAB 2
తొలిప్రేమ FAB 9

Now Showing

ఒక్క క్షణం DEC 28
MCA DEC 21
హలో DEC 22
మళ్ళీ రావా DEC 8
జవాన్ DEC 1

Poll