టాలీవుడ్

‘జై సింహా ‘..రజనీకాంత్ సూపర్ హిట్ కు ఫ్రీమేక్?

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘జై సింహా’. కే.ఎస్‌ రవికుమార్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాని 1995లో వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘ముత్తు’ ఆధారంగా తెరకెక్కించారని సమాచారం. ఈ విషయాన్ని ‘ముత్తు’ చిత్ర రచయిత రత్నం వెల్లడించారు.

అప్పట్లో‘ముత్తు’ చిత్రం జపనీస్‌ వెర్షన్‌లోనూ విడుదలై రికార్డులు సృష్టించింది. అదేవిధంగా ‘జై సింహా’ చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంటుందని రత్నం తెలిపారు. సినిమా సెకెండ్‌ హాఫ్‌ మొత్తం సెంటిమెంట్‌తో కూడిన సన్నివేశాలు ఉంటాయని ప్రేక్షకుడి చేత కన్నీరుపెట్టిస్తాయని పేర్కొన్నారు.

‘సింహం మౌనాన్ని సన్యాసం అనుకోవద్దు. సైలెంట్ గా ఉందని కెలికితే తల కొరికేస్తదంటూ’ అంటూ బాలకృష్ణ వచ్చేసారు. సీనియర్ హీరో, యువరత్న నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ జై సింహా . ఈ సినిమా టీజర్ గురువారం విడుదలైంది. పూర్తి స్దాయి యాక్షన్ తో బాలయ్య మరోసారి నట విశ్వరూపం చూపించారని ఈ టీజర్ చూసినవారంతా అంటున్నారు. యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసిన కొద్ది సేపటికే మంచి రెస్పాన్స్ తో లెక్కకు మించిన వ్యూస్, లైక్స్ తో జై సింహా టీజర్ సింహంలా దూసుకుపోతోంది.

ఇందులో బాలయ్యకు జోడీగా నయనతార, నటాషా దోషి, హరిప్రియలు నటిస్తున్నారు. ప్రకాశ్‌ రాజ్‌, అశుతోష్‌ రానా, బ్రహ్మానందం, మురళీ మోహన్‌, జయప్రకాశ్‌ రెడ్డి సహాయ పాత్రల్లో నటిస్తున్నారు. సీ.కే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని కల్యాణ్‌ నిర్మిస్తున్నారు. చిరంతన్‌ భట్‌ సంగీతం అందించారు. సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను బాలయ్య కు తిరుగులేని రికార్డ్‌ ఉన్న సంక్రాంతి సీజన్‌‌లో జనవరి 12న రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

జై సింహా షూటింగ్ పూర్తయిన వెంటనే తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు బాలకృష్ణ.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

రంగస్థలం MAR 30
భరత్ అనే నేను APR 20
కాలా APR 27
నా పేరు సూర్య MAY 4

Now Showing

కిరాక్ పార్టీ MAR 16
ఏ మంత్రం వేసావె MAR 9
మనసుకు నచ్చింది FEB 16
అ! FEB 16
తొలిప్రేమ FEB 10
చలో FEB 2