టాలీవుడ్

బాహుబలి-2: మరో అరుదైన ఆశ్చర్యపోయే రికార్డ్

baahubaliప్రపంచంవ్యాప్తంగా రికార్డ్ లు నెలకొల్పే విషయంలో `బాహుబలి-2` క్రేజ్ వెనకడుగు వేయటం లేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ రికార్డులను బద్దలుకొట్టి కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఎన్నో అవార్డులు అందుకుంది. రీసెంట్ గా 2017కు గానూ గూగుల్ ప్లే లో `సాహోరే బాహుబలి` పాట బాహుబలి: ది గేమ్…టాప్ స్లాట్ లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం మరో అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంది.

అంతర్జాతీయంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని పెంచిన ఈ సినిమా గురించి తెలుసుకోవడానికి ఆన్‌లైన్లో కోట్ల మంది వెతికారు. ఇంగ్లీషు వికీ పీడియాలో ఈ సినిమా గురించి అత్యధిక మంది చదివారని వికీ మీడియా ప్రకటించింది. 2017లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది వికీపీడియాలో చదివిన 25 ఆర్టికల్స్‌ జాబితాను ఆ సంస్థ విడుదల చేసింది.

ఇందులో ‘డెత్స్‌ ఇన్‌ 2017’ 3.73 కోట్ల వ్యూస్‌తో మొదటి స్థానంలో ఉంది. తర్వాత అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ‘డొనాల్డ్‌ ట్రంప్‌’ పేరు ఉంది. ఆయన వికీపీడియా ప్రొఫైల్‌ను 2.96 కోట్ల మంది చూశారు. 1.92 కోట్ల వ్యూస్‌తో ‘ఎలిజబెత్‌ 2’ మూడో స్థానంలో, 1.87 కోట్ల వ్యూస్‌తో ‘గేమ్స్‌ ఆఫ్‌ థ్రోన్‌’ (సీజన్‌ 7) నాలుగో స్థానంలో ఉంది. 1.46 కోట్ల వ్యూస్‌తో ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ పదకొండో స్థానాన్ని సొంతం చేసుకుంది.

ఓ ప్రాంతీయ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ ఘనతను సాధించడం విశేషం. ఇక ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌లోనూ టాప్‌ ట్రెండిగ్‌ సెర్చ్‌ క్వెరీగా నిలిచింది. ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువ మంది శోధించింది ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్‌’ గురించేనట. ఈ మేరకు గూగుల్‌ నేడు టాప్‌ టెన్‌ సెర్చ్‌ క్వెరీలను విడుదల చేసింది.

ట్విట్టర్ లో 2017 కు గానూ బిగ్గెస్ట్ మూవీ ఈవెంట్ గా బాహుబలి-2 టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. # బిగ్ బాస్-11 – # మెర్సల్ లు # బాహుబలి-2 తర్వాతి స్థానాల్లో ఉన్నాయని తెలిపింది. ఆ తర్వాత ప్రధాని మన్ కీ బాత్ – జీఎస్టీ – కొన్ని క్రికెట్ మ్యాచ్ లు ట్విట్టర్ ట్రెండింగ్ లో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? ఈ ప్రశ్న తోనే ఈ చిత్రం ట్రెండింగ్ లో నిలవటం చెప్పుకోదగ్గ విషయం.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
చలో FAB 2
తొలిప్రేమ FAB 9

Now Showing

ఒక్క క్షణం DEC 28
MCA DEC 21
హలో DEC 22
మళ్ళీ రావా DEC 8
జవాన్ DEC 1

Poll