బాలీవుడ్

వాజ్ పేయీ జీవితం సైతం..తెరపైకి

AB VAJPAYEEసినిమావాళ్ల దృష్టి మొత్తం బయోపిక్ ల మీద పడింది. రాబోయే 2018 ఏడాది మొత్తం బయోపిక్‌ల రిలీజ్ లే ఉండనున్నాయి. ఇప్పటికే బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు సైనా నెహ్వాల్‌, పి.వి సింధు, పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌లతో పాటు శివసేన అధినేత బాల్‌ఠాక్రే, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, అలనాటి నటుడు నందమూరి తారక రామారావు, బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ బయోపిక్‌లుసిద్ధమవుతున్నాయి. ఇప్పుడు మరో బయోపిక్ కు రంగం సిద్దమైంది.

మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ బయోపిక్‌కు ‘యుగపురుష్‌ అటల్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. బాలీవుడ్‌ దర్శకుడు మయాంక్‌ పి.శ్రీవాస్తవ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. 2018లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. అటల్ 93వ జన్మదినం సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ని ప్రకటించారు.

స్పెక్ట్రమ్‌ మూవీస్‌ బ్యానర్‌పై రాజీవ్‌ ధమీజా, అమిత్‌ జోషి, రంజిత్‌ శర్మ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలో నటీనటుల వివరాలు వెల్లడించనున్నారు. ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీ లహరి ఓ ప్రత్యేక పాటను కంపోజ్‌ చేసినట్లు తెలుస్తోంది.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16