గాసిప్స్

‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు నెక్ట్స్ చిత్రం ఏ హీరోతో అంటే…

arjun-reddy-movie-director-sandeep-reddy-vanga-interview-7విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. శుక్రవారం విడుదలైన ఈసినిమా విజయవంతంగా ప్రదర్షింపబడుతూ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ని ఉర్రుతలూగిస్తోంది. సినిమా కథలో కొత్తదనం కనిపిస్తుందని ప్రేక్షకవర్గాలు అంటున్నాయి. మరోవైపు మొదటి సినిమాతోనే కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన టాలెంట్ రుజువుచేసుకున్నాడు. ఈ నేపధ్యంలో ఈ దర్శకుడు తన తదుపరి చిత్రం ఏ హీరోతో చేయబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది.

అందుతున్న సమాచారం బట్టి ఆల్రెడీ తన సెకెండ్ ప్రాజెక్టుని రెడీ చేసుకుంటున్నారు ఆ చిత్ర దర్సకుడు సందీప్ రెడ్డి. సందీప్ తదుపరి చిత్రం శర్వానంద్ తో అని తెలుస్తోంది. గతంలో అర్జున్ రెడ్డి కోసం కూడా శర్వానంద్ ని కలిస్తే వర్కవుట్ కాలేదు. అయితే తన తదుపరి చిత్రం కోసం కూడా మరోసారి శర్వానంద్ ను సంప్రదించాడట దర్శకుడు సందీప్ రెడ్డి.

అర్జున్ రెడ్డి సినిమాలు షూటింగ్ స్టేజ్ లో ఉన్న టైమ్ లోనే శర్వానంద్-సందీప్ రెడ్డి మధ్య స్టోరీ డిస్కషన్లు జరిగాయి. ఇద్దరూ కలిసి ఓ స్టోరీలైన్ లాక్ కూడా చేశారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. త్వరలోనే ఆ కథతో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. తన రెండో మూవీని కూడా సొంత బ్యానర్ పైనే నిర్మించాలని డిసైడ్ అయ్యాడు సందీప్ రెడ్డి. ఈ విషయాన్ని ఈ మధ్య ప్రకటించాడు కూడా.

“దర్శకుడు సందీప్ రెడ్డి ముందుగా అర్జున్ రెడ్డి కథను నాకు వినిపించాడు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా చేయలేకపోయాను. ఈసినిమా సక్సెస్ సంతోషాన్నిస్తుంది. విజయ్ దేవరకొండతో పాటు యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు” అని తన పేస్ బుక్ ద్వారా శర్వానంద్ తెలియజేశాడు. శర్వానంద్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో ‘మహానుభావుడు’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll