టాలీవుడ్

‘అర్జున్‌ రెడ్డి’ పోస్టర్లు చింపేసి.. థియేటర్ లో ఆందోళన,ధర్నా

arjun-reddyమొదటి రోజున నుండే హిట్ టాక్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ సినిమా పట్ల యువత మరీ క్రేజీగా ఉన్నారు. సినిమా ఆడుతున్న ప్రతి స్క్రీన్లో మెజారిటీ యువతే ఉంటున్నారు. అందుకే అన్ని చోట్ల చిత్రం బ్రహ్మాండమైన వసూళ్లను రాబడుతోంది. ఇదిలా ఉంటే మరో ప్రక్క ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాపై వివాదాలు కొనసాగుతున్నాయి.

తాజాగా విజయవాడలో అర్జున్ రెడ్డి సినిమాపై మ‌హిళ‌లు మండిప‌డ్డారు. మ‌ధ్యాహ్నం విజ‌య‌వాడ‌లోని రాజ్ థియేట‌ర్ వ‌ద్ద ఏపీ మహిళా సమాఖ్య, మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్లను చించేశారు. అయిన‌ప్ప‌టికీ ఆ సినిమా ప్ర‌ద‌ర్శిస్తుండ‌డంతో ఆగ్ర‌హంతో థియేట‌ర్‌లోకి చొచ్చుకెళ్లారు.

థియేటర్ ల ముందు కట్డిన ఫ్లెక్సీలను చించివేశారు. అశ్లీలత, అసభ్యతతో కూడిన ఈ సినిమాను తక్షణం నిషేధించాలని డిమాండ్ చేశారు. ఆ సినిమాలోని డైలాగులు, సీన్లు త‌మ పిల్ల‌ల‌ను చెడుదారి ప‌ట్టించేలా ఉన్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ సినిమాపై ఫిర్యాదులు చేసిన‌ప్ప‌టికీ అధికారుల నుంచి స్పంద‌న లేద‌ని అన్నారు. ఆందోళన నిర్వహిస్తున్న ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గాభవాని సహా పలువురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని, స్టేషన్ కు తరలించారు.

మరో ప్రక్క సంస్కృతి, సంప్రదాయాలకు విఘాతం కలిగించేలా వున్న అర్జున్‌ రెడ్డి సినిమాను తక్షణం నిషేదించాలని కోరుతూ వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో నగర జాయింట్ పోలీస్ కమిషనర్‌ రమణకుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సినిమా కారణంగా యువత పెడదోవ పట్టే ప్రమాదం వుందని వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పి. గౌతంరెడ్డి, మున్సిపల్‌ ఫ్లోర్ లీడర్ పుణ్యశీల ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి సినిమాల కారణంగా సామాజిక విలువలు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు.

‘అర్జున్‌ రెడ్డి’ సినిమాపై ఇప్పటికే పలువురు నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఈ సినిమా ప్రదర్శించకుండా ఉత్తర్వులు జారీ చేయాలని సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు వి. హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. ఈ చిత్రం డ్రగ్స్‌ వాడకాన్ని ప్రోత్సహించేదిగా ఉందని ఆరోపించారు.

ముఖ్యమంత్రి స్వయంగా సినిమా చూసిన తర్వాత నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ సినిమాపై సెన్సార్‌ బోర్డుకు, హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌కు ఇప్పటికే ఫిర్యాదు చేశానని తెలిపారు. ఈ చిత్రం చాలా బాగుందని మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేయడాన్ని ఆయన విమర్శించారు.

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll