బాలీవుడ్

సెట్ లో కరెంట్‌ షాక్‌… టెక్నీషియన్‌ మృతి

anushkaబాలీవుడ్‌ నటి అనుష్క శర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘పరి’. ఆమె తన సొంత నిర్మాణ సంస్థలో ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రోసిట్‌ రాయ్‌ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. మంగళవారం ఈ సినిమా సెట్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. కరెంట్‌ షాక్‌కు గురై ఓ టెక్నీషియన్‌ మృతి చెందారు.

‘అనుకోకుండా జరిగిన సంఘటన ఇది. లైటింగ్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందినమా యూనిట్‌ సభ్యుడు శాహబెను మేం కోల్పోయాం. వెంటనే తగిన వైద్య సేవలు అందించినప్పటికీ ఆయన్ను రక్షించలేకపోయాం. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు మా యూనిట్‌ అండగా నిలిచింది’ అని నిర్మాతలు బుధవారం ప్రకటన విడుదల చేశారు.

పరి ఓ థ్రిల్లర్‌ చిత్రంగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈచిత్రాన్ని క్లీన్‌స్లేట్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై అనుష్క శర్మ నిర్మిస్తోంది. ప్రోసిత్‌రాయ్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇక నిర్మాతగా అనుష్కకు ఇది మూడో చిత్రం. అంతకు ముందు ఫిల్లారి, ఎన్‌హెచ్‌10 చిత్రాలను నిర్మించింది ఈ బాలీవుడ్‌ భామ.

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll