టాలీవుడ్ రివ్యూస్

‘భాగమతి’ కాదు ఇంకో అరుంధతి

నటీనటులు: అనుష్క.. ఉన్ని ముకుందన్‌.. జయరాం.. ఆశా శరత్‌.. ప్రభాస్‌ శ్రీను.. ధనరాజ్‌.. మురళీశర్మ.. తలైవాసల్‌ విజయ్‌.. విద్యుల్లేఖ రామన్‌ తదితరులు
సంగీతం: ఎస్‌.ఎస్‌. తమన్‌ఛాయాగ్రహణం: ఆర్‌.మది
కళ: ఎస్‌.రవీందర్‌, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాత: వంశీ.. ప్రమోద్‌
దర్శకత్వం: జి.అశోక్‌
బ్యానర్‌: యూవీ క్రియేషన్స్‌
bhagmathi

నుష్క హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రతో సినిమా ..అదీ హర్రర్ జానర్ లో చేస్తోందనగానే టక్కున గుర్తుచ్చే సినిమా ‘అరుంధతి’.అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా , అదే కథని,అదే డైరక్టర్ మళ్లీ తీసినా ‘అరుంధతి’ స్దాయి మ్యాజిక్ జరగటం కష్టమే. కానీ ఈ చిత్రం ట్రైలర్ చూడగానే ‘అరుంధతి’కు మరో అగుడు ముందుకేసి చేసిన సినిమా అనిపించింది అందరకీ. దాంతో భాగమతిని పలకరించటానికి జనం థియోటర్స్ దగ్గర క్యూలు కట్టారు. వారి అంచనాలను ఈ సినిమా అందుకుందా… ‘అరుంధతి’ కు ఈ సినిమాకు సంభందం ఉందా…అసలు ఈ సినిమా కథేంటి,బాహుబలి తర్వాత అనుష్క చేసిన ఈ సినిమా ఆమెకు ప్లస్ అవుతుందా వంటి విషయాలు రివ్యూలో చదువుదాం.

కథేంటి

చంచల (అనుష్క) ఓ ఐఏయస్ అధికారి. చక్కగా ఉద్యోగం చేసుకోవాల్సిన ఆమె ఓ మర్డర్ కేసులో జైల్లో ఉంటుంది. ఈ కష్టం చాలదన్నట్లు ఆమెను సీబీఐ వాళ్లు టార్గెట్ చేస్తారు. చంచలను ఆమె సెక్రటరీ గా పనిచేసిన మినిస్టర్ కు చెందిన అక్రమ కేసులో ఇంటరాగేట్ చేయటానికి ఎంచుకుంటారు. అయితే ఆమె ఐఏఎస్ ఆఫీసర్ కావటంతో మీడియా దృష్టి అంతా ఆమెపైనే ఉంటుంది. దాంతో జైల్లో ఆమెను కలిస్తే మీడియాలో రచ్చ అయిపోతుందనే భయంతో రహస్యంగా ఆమెను భాగమతి బంగ్లాకు చేర్చి అక్కడ ఇంటరాగేషన్ పెట్టుకుంటారు. కానీ వారికి పాడుబడ్డ భాగమతి బంగ్లా ఎలాంటిదో… అసలు తెలియదు. గుడ్డిగా అక్కడకు వెళ్లాక చంచలను ..భాగమతి ఆవహిస్తుంది. రచ్చ రచ్చ చేస్తుంది. అక్కడ నుంచి కథ హారర్ టర్న్ తీసుకుంటుంది. ఇంతకీ భాగమతి ఎవరు..అసలు సీబీఐ వారు చంచలను ఎప్రోచ్ అవటానికి కారణం ఏమిటి…చంచల చేసిన మర్డర్ ఏమిటి… బంగ్లా వెనక ఉన్న అసలు కథ ఏమిటి..భాగమతికి చంచలకు ఉన్న సంభంధం ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది

వరస పెట్టి ఆ మధ్యన హర్రర్ సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా హర్రర్ కామెడీ సినిమాలు బాగా ఆడాయి. ఇప్పుడు ఆ వేడి కాస్త తగ్గింది. దాన్ని మళ్లీ రాజేద్దామా అన్నట్లుగా భాగమతి రంగంలోకి దూకింది. హర్రర్ ఎలిమెంట్స్ కు తోడుగా థ్రిల్లింగ్ నేరేషన్ ని ఎంచుకుంది. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే ట్విస్ట్ చూసేవారిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అయితే ఆ ట్విస్ట్ నే నమ్ముకుని సినిమా చేయటమే కాస్తంత ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ ట్విస్ట్ మోజులో పడి మిగతా కథ ఆ ట్విస్ట్ ని జస్టిఫై చేయటానికి అల్లినట్లు చాలా బలహీనంగా ఉంటుంది. దాంతో ఫస్టాఫ్ బాగున్నా…ఇంటర్వెల్ అదిరిపోయినా సెకండాఫ్ డీలా పడిపోయింది. క్లైమాక్స్ మరీ నీరసించింది. అయితే ఓవరాల్ ఓకే అనిపించింది. దానికి తోడు ఆ మధ్యకాలంలో తమిళంలో వచ్చి సంచలన విజయం సాధించిన పిజ్జా సినిమా స్క్రీన్ ప్లేని ఈ సినిమా గుర్తు చేయటం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది.

ఎవరెలా చేసారు

ఈ సినిమాలో కీ రోల్స్ లో మళయాళ ఆర్టిస్ట్ లను ఎంచుకున్నారు. వారంతా సీనియర్సే కాబట్టి అలవోకగా ఆడుకుంటూ వెళ్లిపోయారు. అనుష్క సంగతి ప్రత్యేకంగా చెప్పేదేముంది. నటన కన్నా తన విగ్రహంతో కొట్టుకొచ్చేస్తుంది. కామెడీకు పెద్దగా స్కోప్ లేని ఈ సినిమాలో ధన్ రాజ్, ప్రభాస్ శ్రీను, విద్యులేఖ నవ్వించే ప్రయత్నం అయితే చేసారు. ఇక దర్శకుడుగా అశోక్…హై స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేసాడు. కెమెరా వర్క్ సినిమాకు ప్రాణమై నిలిచింది. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సైతం చాలా చోట్ల సీన్స్ ని లేపింది. పాటలు అయితేబాగోలేదు. ఇక ఎడిటింగ్ వర్క్ విషయానికి వస్తే ..సెకండాఫ్ లో మరింత ఎడిట్ చేస్తే బాగుండును అనిపించింది. స్క్రిప్టు విషయానికి వస్తే ..మరింత కసరత్తు చేసి ఉంటే మంచి అవుట్ పుట్ వచ్చేది. కేవలం ట్విస్ట్ లతో కథ నడిపేసి పబ్బం గడుపుకుందామనుకున్నారు. అది చెల్లుబాటు కాలేదు. డైలాగులు గొప్పగా లేవు..కంటెంట్ ని డెలవరీ చేసాయి అంతే.

చివరి మాట

ఇక ఈ సినిమా …ఈ మధ్యకాలంలో వచ్చిన సంక్రాంతి కు వచ్చిన అన్ని సినిమాల కన్నా ఓ మెట్టు పైనే ఉంది. అనుష్క కోసం, చక్కటి విజువల్స్ కోసం , సెకండాఫ్ లో వచ్చే ట్విస్ట్ కోసం ఈ సినిమాకు వెళ్లచ్చు. అలాగని మరీ ‘అరుంధతి’లా మాత్రం ఎక్సపెక్ట్ మాత్రం చేయద్దు. దెబ్బతింటారు.

Comments

comments

Trending

Latest

Teaser

Coming Soon

tr> tr> tr> tr> tr>
చలో FAB 2
టచ్ చేసి చూడు FAB 2
తొలిప్రేమ FAB 9
ఇంటిలిజెంట్ FAB 9
గాయత్రి FAB
కిరాక్ పార్టీ FAB
ఆచారి అమెరికా యాత్ర
మనసుకు నచ్చింది

Now Showing

tr>
భాగమతి JAN 26
రంగుల రాట్నం JAN 14
జై సింహ JAN 12
గ్యాంగ్ JAN 12
అజ్ఞాతవాసి JAN 10