టాలీవుడ్

మొన్న మహేష్, ఈ రోజు అనుష్క..ఇద్దరూ ఒకటే మాట

mahesh-anushkaఈ మధ్యకాలంలో ఏ చిన్న సినిమాకీ రానంత క్రేజ్ అర్జున్ రెడ్డికు వచ్చింది. కేవలం టీజర్, ట్రైలర్, పోస్టర్స్ తోనే రెండు రాష్ట్రాల్లో ఉన్న యూత్ కనెక్ట్ అయ్యిపోయారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం భారీ ఎత్తున రిలీజైంది. ప్రీమియర్ షో నుంచే సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. ఈ నేపధ్యంలో సినిమా సెలబ్రెటీలంతా ఈ చిత్రాన్ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. రెండు రోజుల క్రితం మహేష్ బాబు ఈ చిత్రం బాగుందంటూ మెచ్చుకున్నారు. ఇప్పుడు అనుష్క ఆ లిస్ట్ లో చేరింది.

అనుష్క ‘అర్జున్‌రెడ్డి’ చిత్ర యూనిట్ ని ప్రశంసించారు. ఈ చిత్రాన్ని చూసిన ఆమె ఫేస్‌బుక్‌ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘అర్జున్‌రెడ్డి’ని కచ్చితంగా చూడండి. నిజాయతీగా తీసిన చిత్రమిది. నిర్మాత ప్రణయ్‌రెడ్డి వంగా, దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా, విజయ్‌ దేవరకొండ, షాలిని పాండే, రాహుల్‌ రామకృష్ణ.. చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని అనుష్క పోస్ట్‌ చేశారు.

ఈ సినిమా ఇనానమస్ గా యూత్ నుంచి ప్రశంసలు అందుకుంటోంది. చాలా మంది యూత్ ..అర్జున్ రెడ్డి లో తమను తాము చూసుకుంటున్నారు. ప్రేమ అనే ఎమోషన్ ని కోపం అనే ఎమోషన్ తో క్లాష్ చేసినప్పుడు ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో అర్జున్ రెడ్డి చేసే స్ట్రగుల్ ద్వారా సందీప్ ఆవిష్కరించిన తీరుకి హాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే అంటున్నారు. అలాగే సినిమాలో కంటెంట్ అవసరానికి మించి బోల్డ్ నెస్ చూపించినట్లు అనిపించినా.. అది వెగటు అనిపించకుడా బాలన్స్ చేయటం దర్శకుడు గొప్పతనమే అని మెచ్చుకుంటున్నారు. భావోద్వేగాల మీద అదుపు లేనప్పుడు ఎంతటివాడైనా పతనం చూస్తాడు అనే నిజాన్ని చాలా సున్నితంగా చూపించడం కట్టిపడేస్తుంది.

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll