గాసిప్స్

‘సావిత్రి’ బయోపిక్ లో అనుష్క,ప్రకాష్ రాజ్ పాత్రలు ఇవే

anushka-prakash-raj-mahanati-savitris-biopicఅలనాటి నటి సావిత్రి నిజ జీవిత ఘటనల ఆధారంగా ‘మహానటి’ టైటిల్తో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సమంత, కీర్తి సురేష్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరిద్దరితో పాటు ఇందులో అనుష్క కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే ఈ సినిమాలో సమంత విలేకరిగా, కీర్తి సావిత్రిగా,ప్రకాష్ రాజ్…సావిత్రి భర్త జెమిని గణేశన్‌ గా నటిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఇప్పుడు అనుష్క అలనాటి నటి జమున పాత్రలో నటించనున్నట్లు తెలుగు సినీ వర్గాల సమాచారం. జమున పాత్రకు అనుష్క సరిగ్గా సరిపోతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటివరకు భారతదేశ సినీ చరిత్రలో లేని విధంగా భారీ సినిమా సెట్లు సిద్ధం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జూన్‌లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభంకాబోతోంది. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్, ఏఎన్నార్ రోల్స్ కూడా ఉంటాయని వాటికి జూనియర్ ఎన్టీఆర్, నాగచైతన్య అయితే బావుంటుందని దర్శకుడు అనుకుంటున్నాడట.

ఈ చిత్రం కోసం ఎంతో మందిని కలిసి, రీసెర్చ్ చేసి సావిత్రి జీవితంలోని పలు విశేషాలను తెలుసుకున్నారని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని సీరియస్ ధోరణిలో ఆయన తీయాలనుకోవడంలేదు. సావిత్రి వ్యక్తిగత జీవితంలో విషాదం ఉన్నప్పటికీ, దాన్ని టచ్ చేయకుండా ఆమె జీవితం తాలూకు సెలబ్రేషన్‌లా ఈ సినిమా ఉండేలా నాగ అశ్విన్ స్క్రిప్ట్‌ను వర్కవుట్ చేశారు.

సావిత్రి జీవితంలోని మరపురాని ఘట్టాలు, ఆసక్తికరమైన అంశాలూ ఈ కథలో పొందుపరిచినట్టు తెలుస్తోంది. మరి సావిత్రిగా ఎవరు నటిస్తారు? ఈ చిత్రం ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుంది? అనే అంశాలు తెలియాల్సి ఉంది.

సావిత్రినీ, ఆమె నటించిన చిత్రాల్నీ మర్చిపోలేం. ఆమె జీవితం కూడా ఓ పాఠం లాంటిదే. సినిమాలోని మలుపులూ, గెలుపులూ ఆమె కథలోనూ ఉన్నాయి. అందుకే ఇప్పుడు సావిత్రి జీవితం ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కుతున్నట్టు చెప్తున్నారు.

నాగ్ అశ్విన్ మాట్లాడుతూ..”ఆనాటి ఆనవాళ్లను మళ్లీ సెల్యులాయిడ్‌పై పునః సృష్టి చేయనున్నాం.సామాన్య స్త్రీ నుంచి ఓ సూపర్‌స్టార్‌గా సావిత్రి ఎదిగిన తీరు నేటి తరానికి మంచి పాఠంలా మిగిలిపోయింది. ఇన్నేళ్ళలో ఎంత మంది హీరోయిన్స్ వచ్చినా సావిత్రి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేకపోయారు. నటీమణుల్లో చాలా తక్కువ మంది ‘లెజెండ్’ హోదాన్ని దక్కించుకున్నారు. వాళ్లలో సావిత్రిగారు ఒకరు. ఆమె గడిపిన జీవితం, ఎదుర్కొన్న అనుభవాల కలబోతే ఈ చిత్రం” అని నాగ అశ్విన్ పేర్కొన్నారు.

ఒక మహానటి జీవితానికి తెరరూపం ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు. పైగా రెండో సినిమాతోనే అలాంటి ప్రయత్నం చేయడం అంటే నాగ అశ్విన్‌ని అభినందించాల్సిందే.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

మళ్ళీ రావా DEC 8
MCA DEC 21
హలో DEC 22
ఒక్క క్షణం DEC 23
చలో

Now Showing

జవాన్ DEC 1
ఆక్సిజన్ NOV 30
బాలకృష్ణుడు NOV 24
mental మదిలో NOV 24
ఖాకి NOV 17

Poll