బాలీవుడ్

టీజర్ తో ఇంతలా భయపెట్టేసిందేంటి?

నిర్మాతగా, హీరోయిన్‎గా బాలీవుడ్‎లో రాణించిన అనుష్క శర్మ పెళ్లి తర్వాత తన సినిమా జోరును కాస్త తగ్గించింది. అయితే ఆమె పెళ్ళికి ముందు నుండే ఆమె షూటింగ్‎లో పాల్గొంటున్న సినిమా ‘పరి’. కొత్త దర్శకుడు ప్రోసిత్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ విడుదలైంది.

పరి చిత్రం మార్చి 2న విడుద‌ల కానుండ‌గా, ఈ మూవీ టీజ‌ర్ తాజాగా విడుద‌లైంది. ఇందులో అనుష్క హావ భావాలు అందరిని భ‌య‌పెట్టిస్తున్నాయి. అనుష్క ఆహార్యాన్ని చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ప‌రి చిత్రం ప్రొసిస్ట్ రాయ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా ఇందులో ప‌రంబ్ర‌త చ‌ట‌ర్జీ, రాజ్ క‌పూర్‌, రితాబ‌రీ చ‌క్ర‌వ‌ర్తి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హ‌ర‌ర్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్నో స్పెష‌ల్ ఎఫెక్ట్ ఉంటాయ‌ట‌. తాజాగా విడుద‌లైన టీజ‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.

ఈ టీజర్‎ని అనుష్క శర్మ తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ..’స్వీట్ డ్రీమ్స్ గాయ్స్’ అని టాగ్ చేస్తూనే భయపెట్టింది. టీజర్‎లో మొదట భాదతో కనిపిస్తూ దర్శనమిచ్చిన అనుష్క ముఖం చివరకు అంతా రక్తమయమై కనిపించడంతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతున్న ఈ టీజర్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసింది. క్లీన్‌ స్లేట్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై అనుష్కనే స్వయంగా ఈ సినిమాను నిర్మించింది. సినిమాను మర్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు అనుష్క శర్మ మరో రెండు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16