బాలీవుడ్

ముంబై వరదల్లో చిక్కుకున్న హీరో మాధవన్, హీరోయిన్

భారీ వర్షాలు ముంబై మహానగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన సంగతి తెలిసిందే. ఎడతెరపిలేకుండా కురిసిన వర్షాలకు సామాన్యులకే కాదు.. నగరంలో నివసించే బాలీవుడ్‌ సెలబ్రిటీలు కూడా అష్టకష్టాలు పడుతున్నారు. రోడ్ల మీద, వీధుల్లో నడుములోతు నీళ్లు నిలిచిపోవడంతో తమ వాహనాలు నిలిచిపోయి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ బాధలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

భారీ వర్షం వల్ల ముంబై శాంటా క్రూజ్‌ ప్రాంతంలో వరదనీటిలో తన కారు చిక్కుకుపోయిందని, దీంతో గత్యంతరం లేక బాంద్రాలోని తన స్నేహితునికి ఫోన్‌ చేస్తే.. అతను, అతని కూతురు తనను రక్షించడానికి ముందుకొచ్చారని, అతని ఇంట్లో అత్యవసరంగా ఆశ్రయం పొందానని బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ రాత్రి ట్వీట్‌ చేశారు. ఆపత్కాలంలో ఆదుకోవడం, మానవ సంబంధాలను చాటడంలో ముంబై లాంటి నగరం ప్రపంచంలో ఎక్కడా ఉండదని ఆయన పేర్కొన్నారు. వర్షం కారణంగా తాను గమ్యస్థానం చేరలేకపోయానని ఆయన తెలిపారు.

My silly car down.. had to bail and wade home in thigh deep water.. excitement and frustration…

A post shared by R. Madhavan (@actormaddy) on

మాధవన్ కారు మోకాలి లోతు నీటిలో వెళ్లడంతో ఇంటికి దగ్గర్లో చెడిపోయింది. దీంతో ఆయన మోకాలి లోతు నీటిలో నడుచుకుంటూ వెళ్లారు. హుమా ఖురేషీ మూడు గంటల పాటు ట్రాఫిక్ లో చిక్కుకుపోయానని తెలిపింది.

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll