టాలీవుడ్

పూనమ్ ని కత్తి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవే

katti-poonamప‌వ‌న్‌ కళ్యాణ్ కు మ‌ద్ద‌తుగా ట్వీట్లు చేసింద‌న్న కార‌ణంతో హీరోయిన్ పూన‌మ్ కౌర్ వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన అంశాల‌ను కత్తి మహేష్ కొన్ని ప్ర‌శ్న‌ల ద్వారా మీడియా ముందుంచిన సంగతి తెలిసిందే. వాటికి పూనమ్ కౌర్ కానీ, పవన్ కు చెందిన వారు కానీ అఫీషియల్ గా సమాధానం అయితే ఇవ్వలేదు కానీ …పవన్ అభిమాని రిప్లై ఇచ్చారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ సమాధానాలు యధాతధంగా ఇక్కడ…

అవి జల్సా సినిమా మొదలు పెడుతున్న రోజులు ..

కమిలిని ముఖర్జీ పాత్రకి తొలుత పూనమ్ కౌర్ ని తీసుకోవడం జరిగింది.అపుడే ఫేమ్ లోకి వస్తున్న పూనమ్ కు అది నిజంగా చాలా పెద్ద అవకాశమే.

ఆ సమయంలో డేట్స్ విషయంలో క్లారిటీ లేకపోయినా ,తన వద్దకు వచ్చిన మిగతా సినిమా అవకాశాలు అన్నీ వదులుకుంది. సినిమా కోసం జరిగిన పూజ లలో తను ఉండటానికి అదే కారణం ….

ఆ తర్వాత త్రివిక్రం గారు సినిమా లోనుంచి ఆమె ను మార్చి కమిలిని ముఖర్జీని తీసుకున్నారు, ఇది సినిమాల్లో సర్వ సాధారణ విషయమే అయినా తన కెరీర్ పడిపోవటానికి త్రివిక్రం గారే అని తన ఉద్దేశ్యం కావున అప్పటి నుండి త్రివిక్రమ్ అంటే పూనమ్ కు కోపం ..

అయితే ఒక్కసారిగా తన కెరీర్ పడిపోవడంతో తను బాధ తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసింది ..

ఈ విషయం ఎలాగో తెలుసుకున్న పవన్ కల్యాణ్ గారు నేరుగా తన దగ్గరకు వెల్లి స్పందించారు.తనకు ఈ స్థితి రావడానికి ఎంతో కొంత తను కూడా కారణమే అని తన బిల్ పవన్ కళ్యాణ్ గారే కట్టి ,వాళ్ళ అమ్మ గారికి * ఆమె కూతురుని ( పూనమ్ ) కచ్చితంగా లైఫ్లో మంచి స్థాయి లో ఉండటానికి తన వంతు సాయం చేస్తాను అని మాట ఇచ్చాడు ..అందుకే రాష్ట్ర చేనేత సంస్థకు అంబాసిడర్ అవసరం అయినపుడు తనే సిఫార్సు చేశాడు..

ఇందులో ఆ కత్తి అడిగిన అన్నీ ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి. దీనిపై పూనమ్ కౌర్ స్పందించ వచ్చు , కానీ రేపు ఇంకొకడు వచ్చి కాజల్ మీద సమంత మీద ఇలాంటి ప్రశ్నలే వేసి సమాధానం చెప్పాలి అంటాడు. రోడ్డు మీద పోయే ప్రతి ఒక్కడు సమాధానం చెప్పమంటాడు, చెప్పాలా ?

ఇపుడు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు చేసింది తప్పా ?
ఆయనను గౌరవించకుండా ఎలా ఉండ మంటారు ..

అంటూ పెట్టిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇందులో నిజా నిజాలు ..ఏమిటనేది త్వరలోనే అఫీషియల్ గా పూనమ్ ద్వారా తెలిసే అవకాసం ఉంది.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16