కోలీవుడ్

అంజలి బాయ్ ఫ్రెండ్ హీరో జై అరెస్ట్

anjali jaiజర్నీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన జై చిక్కుల్లో పడ్డాడు. ఇప్పటి వరకు మంచి పేరుతెచ్చుకున్న జై ను అరెస్ట్ చేశారు. తమిళనాడు అడయార్ సమీపంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఓ ప్లైఓవర్ ను ఢీకొట్టాడు. అయితే రాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ కింద శాస్త్రీ నగర్ కు చెందిన పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నిమిత్తం జై విచారణకు హాజరవ్వాల్సి ఉండగా సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. అయితే కేసు విచారణలో ఉండగా అతడిని అరెస్ట్ చేసినట్లు కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే… మద్యం సేవించి కారు నడిపిన నేరంపై తమిళ హీరో జైని పోలీసులు అరెస్టు చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గురువారం అర్థరాత్రి జై తన స్నేహితులు ప్రేమ్‌జీ అమరెన్‌, వైభవ్‌రెడ్డిలతో కలిసి ఓ స్టార్‌ హోటల్‌లో పార్టీ చేసుకుని మద్యం తాగారు. అనంతరం జై ఇందిరానగర్‌లోని తన ఇంటికి కారులో బయల్దేరారు. మార్గమధ్యంలో అడ్యార్‌ ఫ్లై ఓవర్‌ దగ్గర కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారును రోడ్డుపై నుంచి పక్కకు తీసి జైని పరీక్షించగా ఆయన మద్యం సేవించినట్లు గుర్తించారు. దీంతో జై అరెస్టు చేసి.. అనంతరం బెయిల్‌పై విడుదల చేసినట్లు సమాచారం. జై 2014లోనూ మద్యం సేవించి వాహనం నడిపిన నేరంపై అరెస్టయ్యారు.

బుధవారం రాత్రి ప్రేమ్‌జీ ట్విటర్‌లో జై, వైభవ్‌తో కలిసి దిగిన ఫొటోను పోస్ట్‌ చేసి ‘బుధవారం రాత్రి ఫీవర్‌’ అని ట్వీట్‌ చేశారు. ‘జర్నీ’, ‘రాజారాణి’ తదితర చిత్రాలతో జై తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే.

Comments

comments

Trending

Latest

Trailer

Coming Soon

స్పైడర్ SEP 27
మహానుభావుడు SEP 29
లండన్ బాబులు

Now Showing

జై లవ కుశ SEP 21
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18

Poll