టాలీవుడ్

ఈ ఫస్ట్ లుక్ తో భయపెడుతున్న అంజలి

Anjali, Jai in Balloon Movie First Look Posters
Anjali, Jai in Balloon Movie First Look Posters

రీసెంట్ గా తన లేటెస్ట్ చిత్రం బెలూన్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది అంజలి. జై, అంజలి, జననీ అయ్యర్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన తమిళ సినిమా ‘బెలూన్‌’. ఫ్లై హై విత్‌ ఫియర్‌ అనేది ఉపశీర్షిక. సినీశ్‌ దర్శకుడు. ఈ సినిమాను అదే పేరుతో తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని యంగ్ హీరో సందీప్‌ కిషన్‌ ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు.

దెయ్యం గెటప్‌లో అంజలి, బఫూన్‌ గెటప్‌లో జై కనిపిస్తున్న ఈ పోస్టర్‌ ఆసక్తికరంగా ఉంది. పోస్టర్ చాలా కొత్తగా ఉంది అలాగే భయంకరంగాను ఉంది. ముఖ్యంగా అంజలి కళ్లు చాలా భయంకరంగా ఉన్నాయి. ఇక అదే పోస్టర్ లో పెద్ద జోకర్ లా ఆమె ప్రియుడు జయ్ కూడా వెరైటీ స్టైల్ లో ఉన్నాడు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతమందించిన పాటలు త్వరలో విడుదల చేస్తారు.

తెలుగులో అంజలి ఇంతకుముందు రెండు హర్రర్ కథలతో వచ్చింది. అందులో గీతాంజలి సినిమాతో బాగానే భయపెట్టింది మరి బెలూన్ చిత్రంతో తో ఏ విధంగా బయపెడుతుందో చూడాలంటున్నారు ఆమె అభిమానులు.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

లండన్ బాబులు

Now Showing

మహానుభావుడు SEP 29
స్పైడర్ SEP 27
జై లవ కుశ SEP 21
ARJUN REDDY AUG 25

Poll