టాలీవుడ్

కేసులో కోర్టుకు హాజరైన రవి, ఇరుక్కున్నా,వదిలేయండి అంటూ రిక్వెస్ట్

anchor-raviప్రముఖ టీవీ యాంకర్ రవి బుధవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. నాగ చైతన్య నటించిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఆడియో వేడుకలో సీనియర్ నటుడు చలపతిరావు మహిళలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే చలపతిరావు చేసిన వ్యాఖ్యలను సమర్ధిస్తూ సూపర్ గా చెప్పారు అంటూ వ్యాఖ్యలు చేసిన యాంకర్ రవిపై కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.

దీంతో కోర్టు వాయిదా బుధవారం ఉండడంతో రవి కోర్టుకు హాజరయ్యారు. కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా పడింది. ఈ సందర్భంగా యాంకర్ రవి మీడియాతో మాట్లాడుతూ… తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందన్నారు. కేసు విషయాలను సోషల్‌ మీడియా ద్వారా తెలుపుతానన్నారు.

అలాగే ‘అసలు ఆ రోజు ఏం జరిగిందో వివరంగా ఫేస్‌ బుక్‌లో పోస్ట్‌ చేస్తా. మీడియాకు ఇంకా మసాలా ఇవ్వదలచుకోలేదు. కొన్ని పర్సనల్స్‌ ఉంటాయి. అన్ని బయటకు చెప్పలేం. నేను చాలా మారాను. దీనిపై నేను ఏమన్నా మాట్లాడితే…మళ్లీ అదో పెద్ద న్యూస్‌ చేస్తారు’ అంటూ రవి అక్కడ నుంచి వెళ్లిపోయాడు.

ఈ సిట్యువేషన్ లో ఇప్పుడు తానేమీ మాట్లాడదలచుకోలేదని, దాని వల్ల జనాలకు మసాల దొరుకుతుందని రవి అన్నాడు. ‘నేను చాలా ఇరుకున్నాను. ఇప్పుడు చాలా మారాను. జనాలు చాలా మాట్లాడుకుంటున్నారు. లేనిపోనిది సృష్టించి రాసుకుంటున్నారు. అది నాకు నచ్చడం లేదు. దయచేసి అర్థం చేసుకోండి’ అని అతడు కోరాడు.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16