టాలీవుడ్

‘నింద నిజమైతే తప్పక దిద్దుకో. అబద్ధమైతే నవ్వేసి వూరుకో..’

anaరామ్‌చరణ్ హీరోగా వస్తున్న కొత్తచిత్రం ‘రంగస్థలం’. 1985 అనేది టాగ్‌లైన్. మైత్రి మూవీమేకర్స్ బ్యానర్‌పై సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పూర్తి పల్లెటూరు నేపథ్యంలో రానున్న ఈ చిత్రంలో చెర్రీ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. 2018 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు. సినిమాలో చెర్రీ ముందెన్నడూ కనిపించని డిఫరెంట్ లుక్‌లో ఈ చిత్రంలో కనిపించనున్నారు.

అలాగే బుల్లితెర ప్రముఖ యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నటీనటులు ఎలా ఉంటారన్న విషయంపై ఆసక్తి నెలకొంది. అయితే సినిమాకు సంబంధించిన ఒక ఫొటోను అనసూయ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. అందులో గజ్జెలతో ఓ మహిళ పాదాలు.. ఆమె కాలి వేలికి మెట్టెలు ఉన్నాయి. అంతేకాదు పక్కన చిన్న మట్టికుండ కూడా ఉంది. బహుశా చిత్రంలో తన లుక్‌ను తెలుపుతూ అనసూయ ఈ ఫొటో పంచుకున్నట్లు తెలుస్తోంది.

‘నింద నిజమైతే తప్పక దిద్దుకో. అబద్ధమైతే నవ్వేసి వూరుకో..’ అని ఈ ఫొటోకు క్యాప్షన్‌ పెట్టారు. మరి ఇది సినిమాలోని డైలాగా.. లేక ఆమె అభిప్రాయమా? అన్న విషయం తెలియాలంటే ‘రంగస్థలం’ విడుదలయ్యే వరకూ వేచి చూడాల్సిందే.
1985 కాలంనాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఈ చిత్రం కోసం రూ. 5 కోట్లతో సెట్‌ కూడా వేశారు. ఇందులో రామ్‌చరణ్‌ ఓ ప్రత్యేకమైన వేషధారణలో కనిపించబోతున్నారట. 2018 సంక్రాంతికి చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll