టాలీవుడ్

జబర్దస్త్‌ వివాదాస్పద స్కిట్ ని సమర్దిస్తూ అనసూయ ఇలా..

anasuyaఅనాథపిల్లలపై జబర్దస్త్‌ కమెడియన్‌ హైపర్‌ ఆది చేసిన స్కిట్‌ వివాదమవుతున్న సంగతి తెలిసిందే. స్కిట్ లో అనాథల్ని ఉద్దేసిస్తూ నన్ను చిన్నప్పుడు చెత్త కుండీలో పడేశారని అనాథ పాత్రధారిగా ఉన్న రైజింగ్ రాజు అంటే..

నీ లాంటి వాడిని చెత్త కుండీలో కాకుండా తిరుపతి హుండీలో వేస్తారా.. వీళ్లు అనాథల్లా లేరు.. పదికీ పాతికకు పీకలు కోసేలా ఉన్నారు వీళ్లు అనాథలు ఏంటి?

ఇంతకీ అనాథలు అంటే ఏమిటో తెలుసా.. అతిగా ఆవేశపడే ఆడదానికి.. అతిగా ఆశపడే మగాడికి కలిగే సంతానాన్నే అనాథలు అంటారని తనదైన శైలిలో బూతు కామెడీకి తెరతీస్తూ.. అనాథలపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యంగా హైపర్ ఆది ‘అతిగా ఆవేశపడే ఆడదానికి .. అతిగా ఆశపడే మగాడికి కలిగే సంతానంని ఆనాథలు అంటారు’ అనే డైలాగ్‌తో అనాథల మనోభావాలను దెబ్బతీసాడని.. ఎలాంటి అండ లేని అభాగ్యులపై ఇంత నీచంగా డైలాగ్‌లు చెప్పడం ఏమిటని సోషల్‌ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఈ విషయమై అనసూయ స్పందించారు. హైపర్ ఆదికి మద్దతుగా అనుసూయ కామెంట్స్ చేసింది. కామెడీని కామెడీగా చూడాలని కోరింది. అయితే ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో అనుసూయ ట్వీట్ గురించి పలువురు నెగిటీవ్ కామెంట్లు చేశారు. ఆ కామెంట్లపై స్పందించిన అనసూయ తనతో వాదించేవారిని బ్లాక్ చేస్తున్నానంటూ ట్వీట్ చేసింది.

అలాగే అనసూయ మాట్లాడుతూ…’కొన్ని విషయాలలో కొందరు ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారేమో అనిపిస్తుంది. నాకు కానీ, చేస్తున్న వారికి కానీ, చూస్తున్న వారందరూ కూడా ఎంటర్‌టైన్‌మెంట్ వరల్డ్‌లో జబర్ధస్త్ హిస్టరీ క్రియేట్ చేసిందని ఒప్పుకోవాల్సిందే. ఒక షో ఇంతగా ఆదరణ దక్కించుకోవడం అనేది ఇంతకు ముందు ఎన్నడూ జరగలేదు. మన తెలుగు టెలివిజన్‌ని టాప్ లెవల్‌లో నిలబెట్టిన ఘనత జబర్ధస్త్‌ది. బాహుబలి ఎలానో జబర్దస్త్ కూడా అంతే. అలాంటి విజన్‌ని ఇందులో చూస్తున్నాం. మేం చాలా కష్టపడుతున్నాం. నా కంటే రోజా, నాగబాబు, టీమ్ మెంబర్స్ ఎంతో కష్టపడుతున్నారు. ఇలాంటి షో ని నిర్భందించాలని చూడకూడదు. క్రియేటీవిటీని తొక్కేయవద్దు అని అన్నారు.

ఇక ప్రతిదాన్ని భూతద్ధంలో చూస్తూ రియాక్ట్ అవుతున్నారు. మొన్న వాళ్లు చేసిన స్కిట్ అలాంటిది. వాళ్లంతా అనాథశ్రమంకి వెళతారు. అక్కడున్న వారిని ఉద్ధేశించి లీడ్ కోసం అలా తీసుకున్నారు. నవ్వుకోండి అంతే. మా ఉద్దేశ్యం నవ్వించడమే. లైఫ్‌లో వచ్చే అన్ని అంశాలను జబర్ధస్త్ కళ్లకి కట్టినట్లు చూపిస్తుంది.

మిమ్మల్ని నవ్వించే వాళ్లందరిని ఇలా ఏడిపించడం ఏమైనా బాగుందా? మీరిలా చేస్తే వాళ్లు భయపడిపోతారు. అది చేస్తే ఏం ప్రాబ్లమో, ఇది చేస్తే ఏం ప్రాబ్లమో..అనే ఆలోచనలో పడిపోతారు. క్రియేటివిటీ రాదు. మిగతా షో ల విషయంలో ఎలా ఉన్నా.. ఈ షో ని మాత్రం వదిలేయండి. దీని ఉద్దేశ్యం వేరు. దీనికి ఎటువంటి లాజిక్స్ లేవు. ఎంతో ఆలసిపోయి వస్తారు. చూసి ఎంజాయ్ చేయండి. హాయిగా నవ్వుకోండి.

మేము ఎవరినీ టార్గెట్ చేసి అనడం లేదు కదా. చర్చించుకోవడానికి మన రాష్ట్రంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. రోడ్లు, కరెంట్, విద్య, బాలికలపై అత్యాచారం.. ఇలాంటి విషయాలెన్నో ఉన్నాయి. మీకు వినోదాన్ని ఇచ్చే ఈ అంశమే ఎందుకు హైలైట్ చేస్తున్నారు అని అన్నారు.

Comments

comments

Teaser

Trailer

Teaser 2

Coming Soon

ఆక్సిజన్ NOV 30
జవాన్ DEC 1
MCA DEC 21
హలో DEC 22
చలో DEC 29

Now Showing

బాలకృష్ణుడు NOV 24
mental మదిలో NOV 24
ఖాకి NOV 17
లండన్ బాబులు 17 NOV 17
గృహం NOV 10
ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll