టాలీవుడ్

‘ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్’ నుంచి రేష్మికి బై సీన్ లోకి హ‌రితేజ‌? అసలు నిజం ఇదీ

rashmi-haritejaనాలుగైదు రోజులుగా తెలుగు సినీ పరిశ్రమలోనూ, టీవీ మీడియంలోనూ నలుగురు కలిస్తే ఓ హాట్ టాపిక్ రన్ అవుతోంది. అదేమిటంటే…’ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్’ నుంచి రేష్మి ని తీసేసి హ‌రితేజ‌ ని తీసుకుంటున్నారట కదా అని. ఈ విషయమై అఫీషియల్ సమాచారం ఏమీ లేదు. కానీ వెబ్ మీడియా ద్వారా ఈ వార్త బాగా ప్రచారంలోకి వచ్చింది.

వారు చెప్పేదేమిటంటే…

చాలా కాలంగా ‘ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్’ కు ర‌ష్మి యాంక‌రింగ్ చేస్తున్న నేప‌థ్యంలో జ‌నాల‌కు బోర్ కొట్టేసిందని, దీంతో ఆమెను మార్చాల‌ని మ‌ల్లెమాల టీఎం ఎప్ప‌టి నుంచో ఆలోచిస్తున్న‌ద‌ట‌. అయితే ర‌ష్మి స్థానంలో ఎవ‌ర్ని తీసుకురావాలా..? అని ఇన్ని రోజులు ఆ టీం తెగ ఆలోచించింది. కానీ ఎవరూ ఆమెను రీప్లేస్ చేయటానికి దొరకలేదు. కానీ ఈ మ‌ధ్యే బిగ్ బాస్ షో ద్వారా పాపుల‌ర్ అయిన హ‌రితేజ‌ను యాంక‌ర్‌గా ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌కు తీసుకుంటే బాగుంటుందని నిర్ణయానికి వచ్చిందిట. బిగ్‌బాస్ షో ద్వారా కోట్ల మంది అభిమానుల‌ను హ‌రితేజ సంపాదించుకోవ‌డంతో ఆమె పాపులారిటీ ఈ కామెడీ షోకు కూడా ప‌నికొస్తుంద‌ని మ‌ల్లెమాల టీం ఆలోచిస్తున్న‌ద‌ని ఆ వార్తల సారాంశం.

ముఖ్యంగా యాక్టింగ్‌, సింగింగ్, డ్యాన్స్ వంటి అంశాల్లో మ‌ల్టీ టాలెంటెడ్‌గా ఉన్న హ‌రితేజ ఈ షోకు ప‌ర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతుంద‌ని, స్వ‌త‌హాగా చాలా ఫ‌న్నీగా, అంద‌రినీ న‌వ్విస్తూ ఉండే హ‌రితేజ అయితే షోకు ఇంకా మంచి పేరు వ‌స్తుంద‌ని మ‌ల్లెమాల టీం భావిస్తున్న‌ద‌ని రాసేసారు.

నిజం ఏమిటి

మల్లెమాల టీమ్ నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం…ఇవన్నీ కేవలం రూమర్స్ అని, ఒకదానికి మరొకటి అల్లి ప్రచారంలోకి తెచ్చిందే తప్ప మరేమీ కాదని తెలుస్తోంది. రేష్మితో వారు సంతృప్తిగానే ఉన్నారని, అనసూయ, రేష్మిలను ఇప్పుడిప్పుడే తొలగించే ఆలోచన లేదని చెప్తున్నారు. అదండీ విషయం.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

రాజు గారి గది 2 OCT 13
రాజా ది గ్రేట్ OCT 18
ఉన్నది ఒకటే జిందగీ OCT 20
నెక్స్ట్ నువ్వే NOV 03
లండన్ బాబులు

Now Showing

మహానుభావుడు SEP 29
స్పైడర్ SEP 27
జై లవ కుశ SEP 21

Poll