టాలీవుడ్

అబ్బబ్బే…ఆ ఇద్దరా…అసలు అనుకోలేదు

RGV-comments-on-Srideviప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ, అక్కినేని నాగార్జున కాంబినేషన్‌లో ఓ చిత్రం ఈ నెల 20 వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 28 ఏళ్ల తర్వాత వర్మ నాగ్‌తో కలిసి పనిచేస్తున్న సినిమా కావటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో నాగ్‌ స్టైలిష్‌ పోలీస్‌ పాత్రలో నటించనున్నారు.

అలాగే ఈ చిత్రంలో నాగార్జునకి జతగా టబు నటిస్తున్నారని ఈ సినిమా గురించి వార్త వచ్చిన నాటి నుంచీ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. అంతేకాదు ..వర్మకు బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కు ఉన్న అనుబంధంతో ఆయన కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు రూమర్స్ మొదలయ్యాయి . తాజాగా దీనిపై వర్మ ఫేస్‌బుక్‌ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో టబు కానీ అమితాబ్‌ కానీ నటించడంలేదని స్పష్టం చేశారు.

నవంబర్‌ 20 నుంచి అన్నపూర్ణ స్టూడియోస్‌లో రెగ్యులర్‌ షూటింగ్ మొదలవుతుంది. అయితే నాగార్జునకి జోడీగా ఎవరు నటించనున్నారు అన్న వివరాలు మాత్రం వర్మ ఇంకా వెల్లడించలేదు. ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. మరోపక్క ఆయన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాని సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వర్మ వెల్లడించారు.

Comments

comments

Teaser

Trailer

song

Coming Soon

లండన్ బాబులు 17

Now Showing

ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll