బాక్స్ ఆఫీస్

‘అర్జున్‌రెడ్డి’ కు మరో బంపర్ ఆఫర్,నిర్మాత పంట పండింది

arjun-reddyసందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రానికి యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. అద్భుతమైన ప్రేక్షకాదరణతో కలెక్షన్స్ వర్షం కురిపిస్తూ రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ట్రెండ్‌సెట్టర్ మూవీ అంటూ అభినందిస్తున్నారు.

ముఖ్యంగా విజయ్‌ నటన అందర్నీ ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ చిత్ర డిజిటల్‌ రైట్స్‌ భారీ మొత్తానికి అమ్ముడుపోయాయని సమాచారం. ఇంటర్నెట్‌ వీడియో ఆన్‌ డిమాండ్‌ సర్వీస్‌ను అందించే అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఈ చిత్ర హక్కులను దక్కించుకుంది. మీడియా వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్ర హక్కులను అమెజాన్‌ రూ.1.60 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తున్న ‘అర్జున్‌రెడ్డి’ తొలివారంలో రూ.17కోట్లు వసూలు చేసినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే… యువతను, విద్యార్థుల్ని పెడదారి పట్టిస్తున్న అర్జున్‌రెడ్డి సినిమాను నిషేధించాలని డిమాండ్‌ చేస్తూ మెహిదీపట్నంలో శుక్రవారం పలు సంఘాలు పెద్దఎత్తున ఆందోళనకు దిగాయి. విద్యార్థులు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఆల్‌ ఇండియా మహిళా సాంస్కృ తిక సంఘం, ఆల్‌ ఇండియా డెమోక్రటిక్‌ స్టూడెంట్‌ ఆర్గనై జేషన్‌, ఆల్‌ ఇండియా డెమోక్రటిక్‌ యూత్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా పలు సంఘాలు నాయకులు హేమలత, గంగాధర్‌, భరత్‌ మాట్లాడుతూ సినిమాలో హీరో డ్రగ్స్‌కు బానిసై స్తీలతో బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించే సన్నివేశాలున్నాయని అన్నారు. సినిమాని సెన్సార్‌ వాళ్లు విడుదలకు అంగీకరించడం దారుణమని ఆరోపించారు. నిరసన కార్యక్రమంలో మూడు సంఘాల నాయకులు శైలజ, జ్యోతి, స్వాతి, చైతన్య, ప్రతిభ, సత్యనారాయణ, జానీ పాల్గొన్నారు.

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll