కోలీవుడ్

ఫోర్జరీ కేసులో అమలాపాల్, ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు

Amala-Paul-Stills-At-Thiruttuppayale2-Audio-Launch-1ప్రముఖ సినీనటి అమలాపాల్ విలాసవంతమైన కారు కొనుగోలు వ్యవహారంపై వివాదం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు విషయాన్ని కేరళ హైకోర్టు పరిశీలిస్తోంది. ఈ విషయంలో బుధవారం అమల కేరళ న్యాయస్థానంలో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు.

గత ఏడాది అమలాపాల్ పుదుచ్చేరిలో రూ.1.12 కోట్లు వెచ్చించి విలాసవంతమైన కారు కొన్నారు. కారును తన సొంత రాష్ట్రమైన కేరళలో కాకుండా తప్పుడు చిరునామాతో పుదుచ్చేరి ఆర్టీవో కార్యాలయంలో ఆమె రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 20లక్షల రూపాయల పన్ను మాఫీ కోసమేa పుదుచ్చేరిలో అమలాపాల్ కారు కొని తక్కువ పన్నుతో రిజిస్ట్రేషన్ చేయించారని సమాచారం.

అయితే ఈ కారుకు సంబంధించిన డాక్యుమెంట్లలో కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో నివసిస్తున్నట్లు డాక్యుమెంట్లలో అడ్రెస్‌ వివరాలు ఫోర్జరీ చేసిందని ఆరోపణలు వస్తున్నాయి. దాంతో కేరళ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ వద్ద అసిస్టెంట్‌ సెక్రటరీగా పనిచేస్తున్న సంతోష్‌ కుమార్‌ అమలపై కేసు పెట్టాడు. అమల ఫోర్జరీ డాక్యుమెంట్లు ఇవ్వడం వల్ల కేరళ రాష్ట్రానికి నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

దీనిపై పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నరు, మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించారు. కిరణ్ బేడీ ఆదేశంతో పోలీసులు అమలాపాల్ తప్పుడు అడ్రసుతో కారు రిజిస్ట్రేషన్ చేయించిన బాగోతంపై దర్యాప్తు చేస్తున్నారు. అమలాపాల్ తో పాటు మరికొందరు సెలబ్రిటీలు ఇలా పన్ను ఎగ్గొట్టేందుకే పుదుచ్చేరిలో లగ్జరీ కార్లను కొని ఇక్కడే రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని కిరణ్ బేడీ పోలీసులను ఆదేశించారు

దీనిపై గతంలో అమల వివరణ ఇస్తూ తాను పుదుచ్చేరిలోనే నివసించేదాన్నని తన సొంత ఇంటిని అద్దెకు ఇచ్చానని తెలిపారు. తనపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నారు. తమిళ నటుడు ఫహాద్‌ ఫాసిల్‌, నటుడు, రాజ్యసభ ఎంపీ సురేశ్‌ గోపిపై కూడా ఇలాంటి కేసులే నమోదయ్యాయి.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

MCA DEC 21
హలో DEC 22
ఒక్క క్షణం DEC 28
అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
చలో FAB 2
తొలిప్రేమ FAB 9

Now Showing

మళ్ళీ రావా DEC 8
జవాన్ DEC 1
ఆక్సిజన్ NOV 30
బాలకృష్ణుడు NOV 24
mental మదిలో NOV 24
ఖాకి NOV 17

Poll