టాలీవుడ్

నాలోని జ్ఞానాన్ని గుర్తించ‌లేరా? మీడియాని ఏకేస్తూ.. అక్కినేని అమ‌ల లేఖ‌!

amala-akkineniశ్రీదేవి మరణం అనంతరం.. గ‌త నాలుగు రోజులుగా భార‌త మీడియా, ముఖ్యంగా టీవీ ఛానెళ్లు వ్య‌వ‌హ‌రించిన తీరు తీవ్ర విమ‌ర్శ‌ల పాల‌వుతున్న సంగతి తెలిసిందే. వి శ్రీదేవి మ‌ర‌ణం త‌ర్వాత `బాత్రూమ్ జ‌ర్న‌లిజ‌మ్‌` తెర‌పైకి వ‌చ్చింద‌ని ఈస‌డిస్తున్నారు. ఎన్నో ఉన్న‌త శిఖ‌రాలు అధిరోహించిన శ్రీదేవి చివ‌రి క్ష‌ణాల‌ను మీడియా అపభ్రంశం చేసింద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ వైఖ‌రిని అక్కినేని నాగార్జున భార్య అమ‌ల త‌ప్పుబ‌ట్టారు. త‌న ఫేస్‌బుక్ ఖాతా ద్వారా మీడియాకు ఓ ఘాటు లేఖ రాశారు.ఆ లేఖలో ఆమె ఏం రాసారో చూద్దాం…

`నేను ఎలా క‌నిపిస్తున్నానో, ఎంత బ‌రువు పెరిగానో కామెంట్ చేయ‌కుండా వ‌య‌సు మీదప‌డ‌డాన్ని న‌న్ను ఆస్వాదించ‌నిస్తారా? నాకు `జీరో సైజ్` లేదు అనే ఆత్మ‌న్యూన‌తా భావానికి లోన‌వ‌కుండా బట్ట‌లు వేసుకునే స్వేచ్ఛ ఇస్తారా? ఇప్ప‌టి నా పొట్టి జ‌ట్టును, 19 ఏళ్ల వ‌యసులో ఉన్న‌ప్ప‌టి నా పొడ‌వాటి జ‌ట్టుతో పోల్చ‌కుండా, నా జుట్టుకు న‌ల్ల‌రంగు వేసుకునే అవ‌స‌రం లేకుండా చేస్తారా? నా త‌ల‌పై జ‌ట్టును త‌ప్ప‌ నాలోని జ్ఞానాన్ని గుర్తించ‌లేరా?

ఓ వ్య‌క్తి శ‌రీరాన్నిమాత్ర‌మే కాకుండా, మ‌న‌సు లోప‌లి భావాల‌ను అర్థం చేసుకోగ‌లిగే శ‌క్తి కూడా కెమేరాల‌కు ఉంది. నా వంట గురించి, రూమర్ల గురించి ప్ర‌శ్నించ‌కుండా నేను చెప్పే అర్థ‌వంత‌మైన విష‌యాల‌ను పూర్తిగా వింటారా? బాక్సాఫీస్ పిచ్చి నుంచి, కీర్తి అనే పంజ‌రం నుంచి, పేజ్‌-3 నుంచి, లైక్‌లు, కామెంట్ల నుంచి నాకు విముక్తి క‌ల్పిస్తారా? నాకు వ్య‌క్తిగ‌త జీవితాన్ని, స్వేచ్ఛ‌ను ఇవ్వండి. నిజాయితీగా, మాన‌వ‌త్వంతో, క‌రుణతో, ప్ర‌యోజ‌నకారిగా బ‌తికే స్వేచ్ఛ‌ను ఇవ్వండి` అని అమ‌ల ఆ లేఖ‌లో పేర్కొన్నారు.

Comments

comments

Needi Naadi Oke Katha

Trailer

Latest

Song

Coming Soon

రంగస్థలం MAR 30
భరత్ అనే నేను APR 20
కాలా APR 27
నా పేరు సూర్య MAY 4

Now Showing

నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16
ఏ మంత్రం వేసావె MAR 9
మనసుకు నచ్చింది FEB 16
అ! FEB 16
తొలిప్రేమ FEB 10
చలో FEB 2