టాలీవుడ్ రివ్యూస్

‘ఒక్క క్షణం’

చిత్రం: ఒక్క క్షణం 
నటీనటులు: అల్లు శిరీష్‌.. సురభి.. సీరత్‌ కపూర్‌.. అవసరాల శ్రీనివాస్‌ తదితరులు 
సంగీతం: మణిశర్మఛాయాగ్రహణం: శ్యామ్‌ కె.నాయుడు 
కూర్పు: చోటా కె ప్రసాద్‌మాటలు: అబ్బూరి రవి 
నిర్మాత: చక్రి చిగురుపాటి 
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.ఐ. ఆనంద్‌సంస్థ: లక్ష్మీ నరసింహా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 
విడుదల తేదీ: 28-12-2017

okka-kshnam-1

మూడు సినిమాలు వయస్సున్న అల్లు శిరీష్ కి జనాలు ఇంకా అలవాటు పడలేదు. అలవాటు చేసే ప్రాసెస్ లో భాగంగా కొత్త కాన్సెప్టులతో సినిమాలు చేస్తే బెస్ట్ అని నిర్ణయానికి వచ్చినట్లున్నారు. అప్పుడు తన కోసం కాకపోయినా కొత్త కథ కోసం జనం థియోటర్ కు వస్తారు. మెల్లిగా అలవాటైపోవచ్చు అని ఆలోచించి..చేసినట్లున్న ఈ సినిమా పారలల్ లైఫ్ అనే కాన్సెప్టుని పరిచయం చేసింది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’ ఫేమ్ విఐ. ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన సినిమా కావటంతో సినిమా ప్రేమికుల్లో ఖచ్చితంగా ఆసక్తి ఉంది. అది ఏ మేరకు వర్కవుట్ అయ్యింది. అల్లు శిరీష్ కెరీర్ కు ఈ సినిమా ఎంపిక ఏ మేరకు సాయపడింది. అసలు ఈ పారలల్ లైఫ్ అంటే ఏమిటి వంటి విషయాలు కూడిన రివ్యూ చూద్దాం.

ప్రేమ..ప్యార్లల్ లైఫ్

చక్కగా జీవ (శిరీష్) తన ప్రేయసి జ్యోత్స్న (సురభి) ప్రేమలో మునిగితేలుతూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూంటాడు. అయితే వీళ్లు ఆనందంగా ఉండటం విధికి ఇష్టం లేనట్లుంది. దాంతో ఓ రోజు వాళ్లకు ఓ విషయం తెలుస్తుంది. తమ లవ్ స్టోరీ యాజటీజ్ గా జ్యోత్న్స ఉండే అపార్టుమెంట్లో ఉండే శ్రీనివాస్ (అవసరాల శ్రీనివాస్), స్వాతి (సీరత్ కపూర్) ల జంట యొక్క జీవితంలో ఆల్రెడీ ఎప్పుడో జరిగిందని తెలుస్తుంది. అంతేకాదు..ఇప్పుడు తమ రోజూ వారి జీవితంలో జరిగేవి కూడా … సీన్ పొల్లుపోకుండా వారి జీవితంలో జరిగిన సంఘటనలే అని గ్రహిస్తారు. దాంతో భయం పట్టుకున్న ఈ ప్రేమ జంట..కాస్తంత లోతుగా రీసెర్చ్ మొదలెడితే….ఇలా జరగటానికి కారణం … ప్యార్లల్ లైఫ్ అనే అంశమే అని నిర్దారణ అవుతుంది. శ్రీనివాస్, స్వాతిల గతం … తమకు భవిష్యత్తు అవుతోందని తెలుసుకుంటారు. ఇలా తెలుసుకుంటూండగా తమ గత జంట స్వాతి మర్డర్ అవుతుంది. దాంతో తన ప్రేయసి జ్యోత్స్న కూడా చనిపోతుందని ఫిక్స్ అవుతారు. విధిని ఎదిరిస్తేనే తాము ఆ ప్రమాదం నుంచి తప్పించుకోగలమని అర్దం చేసుకున్న ఆ జంట ఏం చేసింది. విధిని వాళ్లిద్దరూ ఎలా ఎదుర్కున్నాడు ? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కొరియన్ కాన్సెప్టు అయినా

కొత్త కథలతో సినిమాలు రావటంలేదనటం అనేది ఎంత ఈజీనో..కొత్త పాయింట్ ని పట్టుకోవటమూ అంతే కష్టం. ఎందుకంటే కొత్త పాయింట్ కోసం చేసే అన్వేషణకు ప్రపంచవ్యాప్తంగా చాలా పోటీ ఉంటుంది. అయితే చాలా సార్లు ఆ కొత్త పాయింట్ ని ఇతరదేశాల వాళ్లే హస్తగతం చేసుకోగలుగుతారు..సినిమా తీయగలుగుతారు. అందుకేనేమో మనవాళ్లూ రిలాక్స్ గా…అన్వేషణకు ఫుల్ స్టాప్ పెట్టి…ఆ ప్రపంచ సినిమాల్లోనే పరమార్దం…కొత్త కధా పదార్దం వెతుకుతారు. అలా పుట్టిందే ఈ సినిమా . కొరియాలో Parallel Life టైటిల్ తో వచ్చిన ఈ సినిమా దాని రూపం,గుణం,రుచి మార్చుకుని ఎనిమిదేళ్ళ తర్వాత మన తెరను అలంకరించింది.

అల్లకంలో అలసత్వం..అదే ఆలస్యం

అయితే అసలు సినిమాను కేవలం కాన్సెప్టు మాత్రమే తీసుకుని ఇక్కడ కథను అల్లుకునే దశలో.. హీరోయిజాలు,పాటలు,ఫైట్స్ ,కామెడీలు కలిసేసరికి కాస్తంత వేగం మందగించింది. అలాగే ఇంటర్వెల్ ట్విస్ట్ ని దృష్టిలో పెట్టుకుని ఫస్టాఫ్ ని మొత్తం కథని సెటప్ చేయటం తో నింపేయటంతో ఏదో జరుగుతున్నట్లు అనిపించినా, ఏమీ జరగని ఫీలింగ్ వచ్చింది. సెకండాఫ్ సగం..అవసరాల శ్రీనివాస్ కథ చెప్పలాలనే అవసరం కోసం ప్లాష్ బ్యాక్ తో నింపేసారు. దాంతో అదో ఇబ్బందిగా అనిపిస్తుంది. అదేదో…ఫస్టాఫ్ లోనే అవసరాల ఫ్లాష్ బ్యాక్, మన హీరో కథ రెండు చెప్పేసి,సమస్యను సెటప్ చేస్తే…సెకండాఫ్ మొత్తం ఆ సమస్యను ఎలా ఎదుర్కొన్నాడనేది చూపిస్తే బాగుండేది. అయితే అఫ్ కోర్స్ అది థ్రిల్లర్ కథా విధానం అనిపించుకోదు. కానీ థ్రిల్లర్ పేరు చెప్పి…చూసే వారికి థ్రిల్లింగ్ లేకుండా చేస్తే ఎలా…

టెక్నికల్ గా …

ఈ సినిమా అద్బుతమని చెప్పలేం కానీ మంచి స్టాండర్డ్స్ తోనే సాగింది. అల్లు శిరీష్ కూడా తన గత చిత్రాల కన్నా పరిణితితో నడించాడు. దర్శకుడు … ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’ వంటి హిట్ తర్వాత ఏ మాత్రం ఎంటర్టైన్మెంట్ లేని థ్రిల్లర్ చిత్రం తో రావటం ఆశ్చర్యకరమే అయినా ఆహ్వానించదగ్గ పరిణామం. హీరోయిన్స్ ఇద్దరూ సోసోగా చేసారు.

ఆడకపోతే మనకే నష్టం..

ఐదు పాటలు, నాలుగు కామెడీ సీన్స్, మూడు ఫైట్స్, రెండు ఏడుపుగొట్టు ప్రహసనాలు కలిసి తయారైందే ఒక తెలుగు సినిమా అనే ఫక్తు ఫార్ములా వ్యవహారం నుంచి తెలుగు సినిమా మెల్లిమెల్లిగా తప్పుకుంటోందనటానికి ఇటువంటి కాన్సెప్టు ఓరియెంటెడ్ సినిమాలే ఉదాహరణ. అయితే ఇలాంటి సినిమాలు ఎన్ని వస్తాయనేదే పెద్ద ప్రశ్న. ఇలాంటి సినిమాలకు ఓపినింగ్స్, మౌత్ టాక్ ప్రధాన సమస్య. పెద్ద హీరోలు ఇలాంటి సినిమాల్లోనూ (గెస్ట్ గా అయినా) కనిపిస్తే కాస్తంత సేలబులిటి పెరిగి..ఎక్కువ మందిని రీచ్ అయ్యి…డబ్బులు తెచ్చిపెట్టి ఇలాంటివి మరిన్ని రావటానికి నిర్మాతలకు ఉత్సాహాన్ని ఇస్తాయి.

అదే సమయంలో హీరోతో సంభంధం లేకుండా…మాస్ మసాలాలు లేకపోయినా ..ప్రతీ కొత్త కథ కలిగి ఉన్న సినిమాని పెళ్లి చూపులు స్దాయి హిట్ చేయగలిగినా ఇలాంటి సినిమాలకు ప్రాణం పోసినట్లు అవుతుంది. ఈ రెండు చేయలేకపోతే ఇలాంటి కాన్సెప్టులు ఒక సినిమా వెలుగులే అవుతాయి. అప్పుడు వేరే దారిలేక ..తిట్టుకుంటూనో…తలగోక్కుంటూనో, సెల్ లో వాట్సప్ చూసుకుంటూనో… మళ్లీ మన మాస్ సినిమా పేరుతో రొట్ట గొట్టుడు సీన్స్ ఉన్న అచ్చ తెలుగు సినిమాలు చూసుకుంటూ కాలక్షేపం చేయాల్సి వస్తుంది.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16