Needi-Naadi-Oke-Katha-baner1
టాలీవుడ్

‘ఒక్క క్షణం’లో …ఓ వింత విషయం..మీరు నమ్మరంతే

శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు లాంటి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ త‌ర్వాత అల్లు శిరీష్ హీరోగా, సురభి, సీరత్ కపూర్ హీరోయిన్లుగా, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రలో, ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి టెర్రిఫిక్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అందించిన చిత్ర ద‌ర్శ‌కుడు విఐ ఆనంద్ డైరెక్షన్ లో లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న చిత్రం ‘ఒక్క క్షణం’. ఈ చిత్రం ఈ రోజు రిలీజైంది. ఈ సినిమా పార్లెల్ జీవితాల ఆధారంగా తెరకెక్కుతోందని సినిమా ట్రైలర్ ఇప్పటికే చెప్పేసింది.

అయితే ఈ చిత్రంలో మీరు ఊహించని ఓ వింత విషయం ఉంది. రీసెంట్ గా అల్లు శిరీష్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఎవరు ఊహించని విధంగా ఒక విషయాన్ని చెప్పాడు. ఈ సినిమాలో హీరో పాత్ర కేవలం 30 నిమిషాలు మాత్రమే ఉంటుందట.

అల్లు శిరీష్ మాట్లాడుతూ.. నా కెరీర్ లో ఇలాంటి సినిమా చేస్తాను అనుకోలేదు. ఒక్క క్షణం సినిమాలో ఆకర్షించే సీన్స్ చాలా ఉంటాయి. అయితే ఇందులో నా పాత్ర కేవలం 30 నిముషాలు మాత్రమే ఉంటుంది. చాల క్యారెక్టర్స్ కి సంబందించిన సీన్స్ వస్తుంటాయి. కానీ చివరలో మాత్రం నేనే ఉంటాను అని ప్రేమ కోసం ఫైట్ చేస్తాను అని శిరీష్ వివరించాడు.

మొదట అల్లు అర్జున్ కూడా వేదం – రుద్రమదేవి సినిమాల్లో మొత్తంగా కొన్ని నిమిషాలే ఉంటాడు. ఆ విషయాన్ని గుర్తు చేసుకొని ముందుగా నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలనే తపనతో వర్క్ చేస్తున్నాను అని అల్లు హీరో వివరించాడు.

చిత్రం ట్రైలర్ విషయానికి వస్తే..

‘నేను ప్రేమించిన అమ్మాయి ప్రాణాల మీదకు వస్తే.. ఫేట్‌తోనైనా, డెస్టినీతోనైనా, చివరికి చావుతోనైనా పోరాడతా’ అంటూ అల్లు శిరిష్ డైలాగుతో వచ్చిన ఈ ట్రైలర్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపించింది.

‘వాళ్ల లైఫ్‌లో జరిగినట్లు మన లైఫ్‌లో జరగడం ఏంటి’ అంటూ అల్లు శిరీష్‌ను సురభి ప్రశ్నించడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. మరి ఎవరిలైఫ్‌లో ఏం జరిగింది? అది వీరిద్దరి లైఫ్‌పై ఎలాంటి ప్రభావం చూపింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే అనే ఉత్సుకతను రేపుతోంది.

లక్ష్మీ నరసింహా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై చక్రి చిగురుపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కొత్త సంవత్సరం కానుకగా డిసెంబరు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

నటీనటులు – అల్లు శిరీష్, సురభి, శ్రీనివాస్ అవసరాల, సీర‌త్ క‌పూర్‌, కాశి విశ్వ‌నాథ్, రోహిణి, జ‌య‌ప్ర‌కాష్‌, ప్ర‌వీణ్‌, స‌త్య‌, సుద‌ర్శ‌న్‌, వైవా హ‌ర్ష‌, ప్ర‌భాస్ శ్రీను, రఘు కారుమంచి, బిల్లి ముర‌ళి, ర‌వి వ‌ర్మ‌, శ్రీసుధ‌, చిత్రం భాషా, భిందు, ప్ర‌ణ‌వ్‌, బద్రం త‌దిత‌రులు న‌టించ‌గా…
కో ప్రొడ్యూసర్స్ – సతీష్ వేగేశ్న, రాజేష్ దండ
సంగీతం – మణిశర్మ
డిఓపి – శ్యామ్ కె నాయిడు
డైలాగ్స్ – అబ్బూరి రవి
ప్రొడక్షన్ డిజైనర్ – రాజీవన్ జి
పి ఆర్ ఓ – ఏలూరు శ్రీను
ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్
ఆర్ట్ – నాగేంద్ర ప్రసాద్
క్రియేటివ్ హెడ్ – సంపత్ కుమార్
కో డైరెక్టర్ అండ్ అడిష‌న‌ల్ డైలాగ్స్‌ – విజయ్ కామిశెట్టి
బ్యానర్ – లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్స్
నిర్మాత – చక్రి చిగురు పాటి
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – విఐ ఆనంద్

Comments

comments

Needi Naadi Oke Katha

Trailer

Latest

Song

Coming Soon

నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
రంగస్థలం MAR 30
భరత్ అనే నేను APR 20
కాలా APR 27
నా పేరు సూర్య MAY 4

Now Showing

కిరాక్ పార్టీ MAR 16
ఏ మంత్రం వేసావె MAR 9
మనసుకు నచ్చింది FEB 16
అ! FEB 16
తొలిప్రేమ FEB 10
చలో FEB 2