టాలీవుడ్

ఫస్ట్ ఇంపాక్ట్ తోనే హిట్టు చుపించావ్ బన్నీ

అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 27న తెర‌పైకి రానుంది. ఈలోగా .. నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ఈరోజు (సోమ‌వారం) ఈ సినిమా ఫ‌స్ట్ ఇంపాక్ట్‌ని చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇందులో బ‌న్ని లుక్‌, హెయిర్ స్టైల్‌, బాడీ లాంగ్వేజ్, వాకింగ్ స్టైల్ టోట‌ల్‌గా డిఫ‌రెంట్‌గా ఉండటంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.

”హూ..ఆర్‌.యూ?” అంటూ విల‌న్ పాత్రధారి అడిగితే.. ’సోల్జ‌ర్‘ అని స‌మాధానం చెబుతాడు అల్లు అర్జున్‌. దానికి బదులుగా ’’నీకు సూర్య అంటే సోల్జ‌ర్‌. కానీ ప్ర‌పంచానికి యాంగ‌ర్‘‘ అని అంటాడు విల‌న్‌. మరో చోట ’’ఇలాగే కొన్ని రోజులైతే.. చ‌చ్చిపోతావు రా‘‘ అని రావుర‌మేష్ అంటే..’’చ‌చ్చిపోతాను గాడ్‌ఫాద‌ర్‌.. కానీ ఇక్క‌డ కాదు.. బోర్డ‌ర్ కెళ్లి చ‌చ్చిపోతాను’’ అంటూ ఎమోష‌న‌ల్‌గా చెప్ప‌డం

ఈ ఇంపాక్ట్‌తో మెగాభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారనే చెప్పొచ్చు. దేశాన్ని కాపాడే మిలటరీ వ్యవస్థ గురించి ఈ సినిమాలో గొప్ప సందేశం ఇవ్వబోతున్నారనే విషయం ఈ ఇంపాక్ట్‌తో అర్థమవుతోంది.

మధ్యలో అనుతో రొమాంటిక్ సీన్ కూడా చూపారు. కోపం ఎక్కువగా ఉండే సూర్య పాత్రలో బన్ని అదరగొట్టాడనే చెప్పాలి. మొత్తానికి ఓ కొత్త అల్లు అర్జున్‌ని ’నా పేరు సూర్య‌‘లో చూప‌బోతున్నాడు వ‌క్కంతం వంశీ. మొత్తానికి ఫ‌స్ట్ ఇంపాక్ట్ బ‌న్ని అభిమానులు మాత్రమే కాదు సగటు ప్రేక్ష‌కుడు కూడా మెచ్చేలానే ఉంది.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
చలో FAB 2
తొలిప్రేమ FAB 9

Now Showing

ఒక్క క్షణం DEC 28
MCA DEC 21
హలో DEC 22
మళ్ళీ రావా DEC 8
జవాన్ DEC 1

Poll