టాలీవుడ్

బన్ని ఊరించిన సర్‌ప్రైజ్‌ ఇచ్చేసారు, ఫస్ట్ పోస్ట్ ఇదిగో

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇస్తానని ఊరించిన సంగతి తెలిసిందే. ఆ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. ఈ రోజు బన్ని ముద్దుల కూతురు అర్హా మొదటి పుట్టినరోజు. ఈ సందర్భంగా తన కుమార్తెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ బన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను తెరిచారు.

ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచాక బన్ని పోస్ట్‌ చేసిన మొదటి ఫొటో అర్హాదే.‘నా చిట్టి ఏంజెల్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. అప్పుడే నీకు ఏడాది నిండిందంటే నమ్మలేకపోతున్నాను.’ అని పేర్కొంటూ ఫస్ట్‌బర్త్‌డే, అల్లుప్రిన్సెస్‌, ఫస్ట్‌ పోస్ట్‌ అన్న హ్యాష్‌ట్యాగ్‌లు జత చేశారు.


తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా బన్ని ఈరోజు తన ఇన్‌స్టాగ్రామ్‌ఖాతాను తెరుస్తానని రెండు రోజుల క్రితమే వెల్లడించారు. పాప ఫొటో పోస్ట్‌ చేసిన కొద్ది నిమిషాల్లోనే మూడు వేలకు పైగా లైక్‌లు వచ్చాయి.

ప్రస్తుతం అర్జున్‌ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బన్నికి జోడీగా అను ఇమ్మాన్యుయేల్‌ నటిస్తున్నారు. 2018లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తనకు జ్ఞాపకాలను పదిలపరచుకోవడమన్నా, మధురానుభూతిగా నిలిచిపోయే ఫొటోలన్నా తనకు ఇష్టమని, ‘ఇన్ స్టా గ్రామ్’లో ఫొటోలతో తన ప్రయాణం ఈ నెల 21 నుంచి ప్రారంభించనున్నానని తెలిపాడు. ఈ సందర్భంగా ఈ ఫొటోను బన్నీ పోస్ట్ చేశాడు.

అంటే ఇన్నాళ్లూ ఫేస్ బుక్ , ట్విట్టర్ లో రచ్చ రచ్చ చేసిన ఫ్యాన్స్ ..ఇక ఇనిస్ట్రగ్రామ్ ని తమ ప్రేమతో ముంచెత్తనున్నారన్నమాట. అలాగే బన్నికి చెందిన మరిన్ని కొత్త కొత్త ఫొటోలు మనం చూడచ్చు..ఏమంటారు.

Comments

comments

Teaser

Trailer

song

Coming Soon

Now Showing

లండన్ బాబులు 17 NOV 17
ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll