టాలీవుడ్

కుర్ర పిల్ల కన్ను కొట్టుడుకి బన్ని సైతం పడిపోయి…ట్వీట్

ఇప్పుడు ఎక్కడ విన్నా ప్రియా ప్రకాష్ వారియర్ గురించిన చర్చలే. ఒకే ఒక్క పాటతో యావత్ కుర్రాళ్ల మనసులకు గాలం వేసి కట్టిపడేసిన మలయాళ భామ ప్రియా ప్రకాష్ వారియర్ ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయింది. ‘ఒరు అదర్ లవ్’ చిత్రంలోని ‘మాణిక్య మలరాయ పూవీ’ అంటూ సాగే పాటలో ప్రియా ఇచ్చిన హావభావాలకి కుర్రాళ్లు తట్టుకోలేకపోతున్నారు.

ఇక ఈ కుర్ర పిల్ల చూపులకి హీరో అల్లు అర్జున్ కూడా పడిపోయాడు. తాజాగా ఆయన తన ట్విట్టర్ పేజీలో ఈ వీడియోని షేర్ చేసి.. ‘‘ఈ మధ్య కాలంలో ఇంత క్యూటెస్ట్ వీడియోని నేనసలు చూడలేదు. సింప్లిసిటీకి ఉన్న పవరే ఇది. నాకు బాగా నచ్చింది..’’ అంటూ అల్లు అర్జున్ పోస్ట్ చేశారు.

అందులోనూ ఫిబ్రవరి 14 కావడంతో ప్రేమికులకు ఈ అమ్మాయి పెద్ద గిఫ్ట్‌గా మారిపోయింది. లవ్‌ని వ్యక్తపరచడానికి కూడా అందరూ ఈ వీడియోనే షేర్ చేస్తుండటంతో టాప్ ట్రెండింగ్‌లో ఈ వీడియో స్థానం దక్కించుకుని సంచలనంగా మారింది.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

tr> tr>
అ! FEB 16
ఆచారి అమెరికా యాత్ర FEB 16
మనసుకు నచ్చింది FEB 16
కిరాక్ పార్టీ FEB

Now Showing

tr> tr>
తొలిప్రేమ FEB 10
ఇంటిలిజెంట్ FEB 9
గాయత్రి FEB 9
చలో FEB 2
టచ్ చేసి చూడు FEB 2
భాగమతి JAN 26
రంగుల రాట్నం JAN 14
జై సింహ JAN 12
గ్యాంగ్ JAN 12
అజ్ఞాతవాసి JAN 10