టాలీవుడ్

బన్ని…దమ్మున్న పోస్టర్ ఇది

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కతున్న చిత్రం ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’. మెగా బ్రదర్ కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, శ‌ర‌త్ కుమార్ ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టీమ్ ఫస్ట్‌ ఇంపాక్ట్‌ పోస్టర్‌ను విడుదల చేసింది.

పోస్టర్‌లో బన్నీ జీపులో కూర్చుని స్టీరింగ్‌ తిప్పుతూ..నోట్లో సిగార్‌తో చాలా ‘స్టైలిష్’గా కన్పిస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ సైనికుడి పాత్రలో నటిస్తున్నారు. కశ్మీర్‌లో చిత్రీకరణ జరుగుతోంది. అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోంది. లగడపాటి శ్రీధర్‌, బన్నివాసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగబాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. విశాల్‌-శేఖర్‌ బాణీలు సమకూరుస్తున్నారు. మే 4న సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది

మరోపక్క ఈ చిత్రం శాటిలైట్‌ హక్కులకు మంచి డిమాండ్‌ ఏర్పడినట్లు సమాచారం. ఓ ఛానెల్‌ రూ.24 కోట్లతో హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌ హక్కులను కూడా ఇదే సంస్థ కొన్నదట. రీసెంట్ గా విడుదల చేసిన ఫస్ట్‌ ఇంపాక్ట్‌తో సినిమాపై అంచనాలను పెంచేశారు అల్లు అర్జున్‌.

అలాగే ప్రేమికుల రోజును పురస్కరించుకుని ‘అట్ట సూడకే.. కొట్టినట్టుగా అట్ట సూడకే’ అంటూ సాగే పాట లిరికల్‌ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ‘లవర్‌ ఆల్సో.. ఫైటర్‌ ఆల్సో’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు.

ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. శేఖర్ ఈ పాటను పాడారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ – శేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని సినిమాను ఏప్రిల్ 27న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు.

ఆర్మీ అధికారిగా కనిపించనున్న బన్ని స్టైల్‌ విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొంటున్నారు. హెయిర్‌ మొదలుకొని ఆయన హావభావాల వరకూ అన్నీ కొత్తగా ఉండబోతున్నాయి. అంతేకాదు ఈ సినిమా కోసం బన్ని ఎంత కష్టపడుతున్నారో ఫస్ట్‌ ఇంపాక్ట్‌ను చూస్తే అర్థమవుతోంది.

Comments

comments

Recent

Latest

Song

Coming Soon

tr> tr>
ఆచారి అమెరికా యాత్ర MAR
కిరాక్ పార్టీ MAR

Now Showing

tr> tr>
మనసుకు నచ్చింది FEB 16
అ! FEB 16
తొలిప్రేమ FEB 10
ఇంటిలిజెంట్ FEB 9
గాయత్రి FEB 9
చలో FEB 2
టచ్ చేసి చూడు FEB 2
భాగమతి JAN 26
రంగుల రాట్నం JAN 14
జై సింహ JAN 12
గ్యాంగ్ JAN 12
అజ్ఞాతవాసి JAN 10