టాలీవుడ్

హైపర్ ఆది మీదే ఫోకస్ ఎక్కువ చేసారే

బుల్లితెర మీద విశేషంగా రాణిస్తున్న యువ కమెడియన్లలో హైపర్ ఆది ఒకరు. ఆయన వేసే కామెడి పంచులు, డైలాగులు బ్రహ్మండంగా పేలుతాయి. అందుకే బుల్లితెర ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఫాలోయింగ్ ఆదికి ఉంది. ఇప్పుడు ఆయన ఓ చిత్రంలో పూర్తి స్దాయి కమిడియిన్ గా మన ముందుకు రావటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆ సినిమానే మేడమీద అబ్బాయి.

అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మేడ మీద అబ్బాయి’. మలయాళ మూవీ ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’ సినిమాకి ఇది రీమేక్. 2015 లో వచ్చిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ అక్కడి ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. ఒరిజినల్ వెర్షన్ ను తెరకెక్కించిన ప్రజీత్ .. తెలుగులోను ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

ఈ సినిమా ద్వారా నిఖిలా విమల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. ఈ సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. ఎమోషన్ .. కామెడీకి సంబంధించిన సీన్స్ పై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా వుంది. ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

ఇందులో తరగతి గదిలో చివరి బెంచ్‌లో కూర్చునే అల్లరి నరేశ్‌ బీటెక్‌ నాలుగు సంవత్సరాల్లోని 24 సబ్జెక్టులు పాస్‌ అవలేక సతమతమౌతుంటారు. దర్శకత్వంపై మక్కువతో ఓ కథను సిద్ధం చేసుకుని సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఆయన పలు సమస్యలు ఎదుర్కొన్నట్లు ట్రైలర్‌ను చూస్తుంటే తెలుస్తోంది.

హైపర్ ఆది మాట్లాడుతూ ఎక్కడ కామెడీ కావాలో అక్కడ కామెడీ వుంటుంది. ఎక్కడ థ్రిల్లింగ్ ఎలిమెంట్ కావాలో అక్కడ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ వున్న సినిమా ఇది. అల్లరి నరేష్ కెరీర్‌లోనే బెస్ట్ సినిమాగా నిలుస్తుంది అన్నారు.

ఈ మధ్య మీ సినిమాలు మూస థోరణిలో వుంటున్నాయి. కొంచెం కొత్తగా ప్రయత్నించండి అని చాలా మంది చాలా రోజులుగా అడుగుతున్నారు. కొత్తగా ఏం చేయాలి? ఎలా చేయాలి? అని నేనూ ఆలోచిస్తూనే వున్నాను. అలా ఆలోచించి కొత్తగా నేను చేసిన ప్రయత్నమే మేడమీద అబ్బాయి అన్నారు అల్లరి నరేష్.

అవసరాల శ్రీనివాస్, జయప్రకాష్, తులసి, సుధ, సత్యం రాజేష్, మధునందన్, జబర్దస్త్ ఆది, పద్మ జయంతి, రవిప్రకాష్, వెన్నెల రామారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఉన్ని ఎస్. కుమార్, సంగీతం: షాన్ రెహమాన్, ఆర్ట్: రాజీవ్ నాయర్, ఎడిటర్: నందమూరి హరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.ఎస్.కుమార్, సమర్పణ: శ్రీమతి నీలిమ, నిర్మాత: బొప్పన చంద్రశేఖర్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.ప్రజిత్.

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll