బాలీవుడ్

అక్షయ్‌ గ్రేట్..మరోసారి రైతులు కోసం

akshay-kumarతీవ్ర కరువుతో అల్లాడుతున్న మహారాష్ట్ర ప్రజల సహాయార్థం యాక్షన్‌ హీరో అక్షయ్ కుమార్‌ యాభై లక్షల రూపాయల విరాళాన్ని అందించిన విషయం విదితమే. అంతేకాకుండా కరువు వల్ల ఆత్మహత్య చేసుకున్న 180 రైతు కుటుంబాలకు అక్కీ 90 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. అక్కీ ఇప్పుడు మరోసారి రైతులు కోసం నడుం బిగించారు.

వివరాల్లోకి వెళితే.. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూసార పరీక్షలు, పంటల బీమా వంటి వ్యవసాయ పథకాలకు బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. బుల్లితెర ప్రకటనల ద్వారా ఆయా పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు ఆయనను ప్రచారకర్తగా నియమించినట్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. దీనిద్వారా రైతుల్లో అవగాహన పెంపొందించొచ్చని పేర్కొన్నారు.

ఇప్పటికే భూసార పరీక్షలకు సంబంధించిన ప్రకటన సిద్ధమైందని, బుల్లితెరపై త్వరలో ప్రసారం కానుందని తెలిపారు. దీంతో పాటు ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన, ప్రధానమంత్రి క్రిషి సించాయ్‌ యోజన, పరంప్రగత్‌ క్రిషి వికాస్‌ యోజన వంటి పథకాలకు అక్షయ్‌ ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

మళ్ళీ రావా DEC 8
MCA DEC 21
హలో DEC 22
ఒక్క క్షణం DEC 23
చలో DEC 29

Now Showing

జవాన్ DEC 1
ఆక్సిజన్ NOV 30
బాలకృష్ణుడు NOV 24
mental మదిలో NOV 24
ఖాకి NOV 17

Poll