టాలీవుడ్

నిన్ను చంపటం గ్యారెంటీ

Nagarjuna-Ram-Gopal-Varma-New-Movie-Posters-3‘నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పినా చెప్పకపోయినా నిన్ను చంపడం గ్యారంటీ. ఎంత త్వరగా చెబితే అంత త్వరగా, తక్కువ నొప్పితో చస్తావ్‌. చూజ్‌’ అనే డైలాగుతో నాగార్జున, రామ్ గోపాల్ వర్మ చిత్రం ప్రారంభం అయ్యింది.

రామ్‌గోపాల్‌ వర్మ- అక్కినేని నాగార్జున కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం ఈరోజు ప్రారంభమైంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సెట్‌లో ‘శివ’ సినిమాలోని సైకిల్‌ చైన్‌ ఆకర్షణీయంగా నిలిచింది. సెట్‌ చుట్టూ భారీ గొలుసు ఏర్పాటుచేసి అప్పటిరోజులను గుర్తుచేసుకున్నారు. నాగార్జునను వివిధ గెటప్‌లలో చూపిస్తూ ఏర్పాటుచేసిన భారీ ఫ్లెక్సీలు ఆకట్టుకుంటున్నాయి.Nagarjuna-Ram-Dopal-Varma-New-Movie-Launch-Stills-06

రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ.. ‘నేను దేవుణ్ణి నమ్మను కానీ నాగార్జునని నమ్ముతాను. వర్మకి బుర్ర లేదు. సత్తా లేదు అంటున్నారు. బుర్ర లేదు కానీ సత్తా ఉందా లేదా అన్నది ఈ సినిమా చెప్తుంది.’ అన్నారు.Nagarjuna-Ram-Dopal-Varma-New-Movie-Launch-Stills-08

ఈ కార్యక్రమంలో నాగ్‌ తెల్ల చొక్కాలో హ్యాండ్సమ్‌ లుక్‌తో కన్పించారు. నాగార్జున సీరియస్ లుక్‌తో ఓ చేతిలో గన్, మరో చేతిలో సగం చింపేయబడి ఉన్న 100 నోటు పట్టుకుని ఉన్న పోస్టర్లు సినిమాపై హైప్‌ను పెంచేస్తున్నాయి.Nagarjuna-Ram-Dopal-Varma-New-Movie-Launch-Stills-12

నాగార్జున మాట్లాడుతూ.. ‘ఈ నెలలో పది రోజుల పాటు సినిమా చిత్రీకరణ జరుగుతుంది. అఖిల్‌ సినిమా విడుదలయ్యాక డిసెంబర్‌ 22 నుంచి సినిమా మొత్తం పూర్తి అయ్యేవరకు చిత్రీకరణ ఉంటుంది’ అన్నారు.Nagarjuna-Ram-Dopal-Varma-New-Movie-Launch-Stills-03

Comments

comments

Teaser

Trailer

song

Coming Soon

Now Showing

లండన్ బాబులు 17 NOV 17
ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll