టాలీవుడ్

ఇంట్రస్టింగ్: ‘హలో’కథ ఇదే

అఖిల్‌ అక్కినేని హీరోగా నటిస్తున్న చిత్రం ‘హలో’. విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై నాగార్జున చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కల్యాణి హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాను డిసెంబరు 22న విడుదల చేయనున్నారు. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా కథను రివీల్ చేసారు నాగార్జున.

చిన్న వయసులో తప్పిపోయిన సోల్‌మేట్‌ కోసం వెతికే అవినాష్‌ పాత్రలో అఖిల్‌ కనపడతాడు. ‘హలో’ సినిమా చూడగానే బాలీవుడ్‌ ‘యాదోం కీ బారాత్‌’ సినిమా గుర్తుకొచ్చింది అన్నారు నాగార్జున.

ఆయన చెప్పిన దాన్ని బట్టి… చిన్న వయస్సులోనే అబ్బాయి …అమ్మాయి అనుకోని కారణాల వల్ల విడిపోతారు. అప్పుడు ఆ అమ్మాయి నెంబర్ ఇచ్చి వెళుతుంది. దాదాపు 15 సంవత్సరాలుగా ఆ హీరో హీరోయిన్ ఇచ్చిన నెంబర్ కి కాల్ చేస్తూనే ఉంటాడు. కానీ ఆన్సర్ ఉండదు. అందుకే హలో అనే టైటిల్ సెట్ చేశామని చెబుతూ.. సినిమా కథ మొత్తం ఒక్క రోజు జరిగే కథగా ఉంటుందని నాగ్ తెలియజేశాడు. మధ్యలో ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట.

‘హలో ఈ అబ్బాయి పేరు అవినాష్‌.. ఒకప్పుడు ఇతడ్ని శ్రీను అని పిలిచేవారు. ఎవరూలేని శ్రీను లైఫ్‌లోకి అనుకోకుండా తన సోల్‌మేట్‌ వచ్చింది. అది అతడికి తెలిసేలోపే దూరమైపోయింది. అన్ని మనం అనుకున్నట్లే జరిగితే దేవుడికి బోర్‌ కొట్టేయదు..’ అంటూ అఖిల్‌ను పరిచయం చేశారు నాగార్జున.

‘‘15 ఏళ్లుగా ఓ అమ్మాయి కోసం ఎదురుచూస్తున్న నీకు పిచ్చిరా.. మర్చిపోవాలి రా’ అని రమ్యకృష్ణ అంటే.. ‘అమ్మా తను నా సోల్‌మేట్‌ మా’ అని అఖిల్‌ బదులిచ్చే విధానం ప్రేక్షకుడ్ని ఆకట్టుకునేలా ఉంది. ‘ఇదంతా వాడు.. ఫోన్‌ కోసమా..!’ అంటూ నటుడు అజయ్‌ ఆశ్యర్యపోతూ కనిపించారు. దీన్ని బట్టి సినిమా ప్రేమకథతో కూడిన ట్విస్ట్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రోడ్డుపై ఓ ట్రక్కును అఖిల్‌ ఛేజ్‌ చేసే సన్నివేశం ఈ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచింది. విక్రమ్‌ కె కుమార్‌ కమర్షియల్‌ హంగులతో దీన్ని రూపొందించారు.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

మళ్ళీ రావా DEC 8
MCA DEC 21
హలో DEC 22
ఒక్క క్షణం DEC 23
చలో

Now Showing

జవాన్ DEC 1
ఆక్సిజన్ NOV 30
బాలకృష్ణుడు NOV 24
mental మదిలో NOV 24
ఖాకి NOV 17

Poll